ETV Bharat / sitara

పవన్​ గురించే మాట్లాడితే తిడతారు: రేణూ దేశాయ్​ - పవన్​కల్యాన్​

నటి రేణూ దేశాయ్ సామాజిక మాధ్యమాల వేదికగా​ అభిమానులతో ముచ్చటించారు. పవన్​​కల్యాణ్​ గురించి ఏమైనా మాట్లాడితే దాన్ని నెగటివ్​గా తీసుకుని తిడుతున్నారని ఈ సంభాషణలో అన్నారు. కరోనా కేసులు పెరుగుతుండటం వల్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

pawan renudesai
పవన్​ రేణూదేశాయ్​
author img

By

Published : Apr 14, 2021, 3:20 PM IST

ఒకవేళ తను పవన్‌కల్యాణ్‌ గురించి ఏదైనా మాట్లాడితే కొంతమంది దాన్ని నెగటివ్‌గా తీసుకుని కామెంట్లు చేస్తున్నారని నటి రేణూ దేశాయ్‌ తెలిపారు. తరచూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే.. ఆమె తాజాగా ఆద్యతో కలిసి కొంతసేపు ఇన్‌స్టా లైవ్‌లోకి వచ్చారు. ఇందులో భాగంగా నెటిజన్లకు కొన్ని సూచనలు చేశారు. కరోనా సెకండ్‌వేవ్‌ ఉద్ధృతంగా ఉన్నందున అందరూ వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని ఆమె కోరారు. అత్యవసరమైతేనే జన సమూహాల్లోకి వెళ్లాలని తెలిపారు.

కాగా, ఓ నెటిజన్ 'మేడమ్‌.. అకీరా ఎందుకని సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉండరు?' అని ప్రశ్నించాడు. 'అకీరాకి పలు సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో అకౌంట్స్‌ ఉన్నాయి. కాకపోతే తన ప్రతి ఖాతా కూడా ప్రైవేట్‌గానే ఉంటుంది. కేవలం తన ఫ్రెండ్స్‌ మాత్రమే అకీరాని అనుసరిస్తుంటారు. తన ఆన్‌లైన్‌ ఖాతాలను పబ్లిక్‌ చేయడం అకీరాకు ఇష్టం లేదు. ఆ విషయంలో తనని ఇబ్బంది పెట్టడం నాకూ నచ్చదు' అని ఆమె జవాబు ఇచ్చారు.

అనంతరం మరో నెటిజన్‌.. 'పవన్‌కల్యాణ్‌ గురించి ఏమైనా మాట్లాడగలరా?' అని అడిగారు. 'ఆయన గురించి ఏం మాట్లాడమంటారు? నా లైవ్‌కి వచ్చి కూడా మీరు ఆయన గురించే మెస్సేజ్‌లు పెడతారు. ఒకవేళ నేను ఆ మెస్సేజ్‌లు చదివి.. ఆయన గురించి మాట్లాడితే, 'రేణుకి ఏం పనిలేదు. ఎప్పుడూ ఆయన గురించే మాట్లాడుతుంది' అని మళ్లీ నన్నే తిడతారు. మీరు అడిగారని మాట్లాడితే నాపై కామెంట్లు చేస్తారు. అలాంటప్పుడు నేనేం చేయాలి. అందువల్లే లైవ్‌కి రావడం కష్టంగా ఉంటుంది' అని ఆమె తెలిపారు.

ఇదీ చూడండి: 'నిశ్చయ్​' పెళ్లికి అందుకే రాలేదు: రేణు దేశాయ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.