'సాహో'తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్. బాలీవుడ్లో అగ్ర కథానాయికగా కొనసాగుతున్న ఈ భామ.. బోలెడంత స్టార్‌డమ్ సంపాదించింది. కానీ ఈ ఇమేజ్ వలన చాలా కోల్పోయానని అంటోంది.
"సినిమాల్లోకి రాకముందు ఇంటి నుంచి చాలా స్వేచ్ఛగా మార్కెట్‌కు వెళ్లేదాన్ని. ముంబయి కార్టర్ రోడ్‌లో హాయిగా తిరిగేదాన్ని. రిక్షాల్లో ప్రయాణం, స్నేహితులతో కలిసి కాఫీషాప్‌కు వెళ్లడం, సేవ్ పూరి, వడా పావ్.. ఇలా ఎన్నో సరదాలు ఉండేవి. అవన్నీ ఇప్పుడు కుదరడం లేదు" -శ్రద్ధా కపూర్, హీరోయిన్
ఇటీవలే విడుదలైన తన సినిమాల వసూళ్లపైనా మాట్లాడిందీ శ్రద్ధా కపూర్.
![shradha kapoor](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4803033_shradha.jpg)
"వసూళ్లను బట్టే ఎంతమంది ఆ సినిమాను చూశారనేది తెలిసిపోతుంది. కలెక్షన్లు బాగున్నాయంటే ఎక్కువమంది చూసినట్టే కదా. చిత్రం బాగుంది అనే మాటతో పాటు వసూళ్లు చాలా కీలకం" --శ్రద్ధా కపూర్, హీరోయిన్
ఓ పక్క మాస్‌మసాలా సినిమాలు చేస్తూనే మరో పక్క నటనకు ప్రాధాన్యమున్న చిత్రాలతోనూ సత్తా చాటుతోంది. ప్రస్తుతం డ్యాన్స్ నేపథ్యంగా సాగే ‘స్ట్రీట్ డ్యాన్సర్, టైగర్ ష్రాఫ్‌తో ‘బాఘీ 3’ల్లో నటిస్తూ బిజీగా ఉంది.
ఇవీ చూడండి.. రైలు టికెట్‌కు డబ్బుల్లేక.. ప్రేమలో విఫలమై