హాలీవుడ్ ప్రముఖ నటుడు ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్.. తనకు రాజకీయాలంటే ఆసక్తి లేదని చెప్పాడు. ఇతరులకు సహాయం చేసేందుకే అందులో చేరానని అన్నాడు. 'గ్రహమ్ నోర్టర్ షో'కు హాజరైన ఈ టెర్మినేటర్ హీరో.. పలు విషయాల గురించి మాట్లాడాడు. 2003-2011 వరకు కాలిఫోర్నియాకు గవర్నర్‌గా పనిచేసిన ఆర్నాల్డ్.. తనను తాను ఓ రాజకీయ నాయకుడిలా చూసుకోలేదని తెలిపాడు.
"నాకు రాజకీయాలంటే ఇష్టం లేదు. అప్పట్లో గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ, నన్ను నేను ఓ రాజకీయ నాయకుడిగా చూసుకోలేదు. నేను ఒక ప్రజాపతినిధిని మాత్రమే" -ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్, హాలీవుడ్ హీరో
ప్రస్తుతం తను నటించిన 'టెర్మినేటర్: డార్క్ ఫేట్' సినిమా ప్రచారంలో బిజీగా ఉన్నాడు ఆర్నాల్డ్. ప్రపంచవ్యాప్తంగా వచ్చే నెల 1న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
ఇది చదవండి: 'హౌజ్ ద జోష్' అయింది ఇప్పుడు డిష్..!