ETV Bharat / sitara

'ఏక్​ మినీ కథ' వీడియో సాంగ్​.. మెగా బ్రదర్స్​ ఫొటో వైరల్​! - ఐ హేట్ మై లైఫ్​ వీడియో సాంగ్​

సంతోష్​ శోభన్​ హీరోగా విభిన్న కాన్సెప్ట్​తో రూపొందిన చిత్రం 'ఏక్​ మినీ కథ'. మే 27న అమెజాన్​ ప్రైమ్​లో విడుదలకానుంది. ఈ సందర్భంగా సినిమాలోని 'ఐ హేట్​ మై లైఫ్​' వీడియో సాంగ్​ను విడుదల చేసింది చిత్రబృందం. మరోవైపు సోమవారం సోదర దినోత్సవం సందర్భంగా మెగాస్టార్​ చిరంజీవి ట్విట్టర్​లో ఓ స్పెషల్​ ఫొటో పోస్ట్​ చేశారు.

i hate my life song released from ek mini katha
'ఏక్​ మినీ కథ' వీడియో సాంగ్​.. మెగా బ్రదర్స్​ ఫొటో వైరల్​!
author img

By

Published : May 24, 2021, 8:53 PM IST

Updated : May 24, 2021, 9:41 PM IST

యువ న‌టుడు సంతోష్​ శోభన్‌ ప్రధాన పాత్రలో తెర‌కెక్కుతోన్న చిత్రం 'ఏక్‌ మినీ కథ'. యూవీ కాన్సెప్ట్స్‌ పతాకంపై కార్తీక్‌ రాపోలు దర్శకత్వం వహిస్తున్నారు. కావ్య థాపర్ నాయిక‌. ఈ చిత్రం మే 27 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా 'ఐ హేట్ మై లైఫ్' అనే ఫుల్ వీడియో సాంగ్‌ను విడుద‌ల చేసింది చిత్రబృందం. భాస్క‌ర‌భ‌ట్ల రచనకు, ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు స్వరాలు సమకూర్చగా.. హేమ‌చంద్ర ఆల‌పించారు. 'వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌', 'ఎక్స్‌ప్రెస్ రాజా' చిత్రాల‌ దర్శకుడు మేర్లపాక గాంధీ కథను అందించారు. ఇందులో బ్రహ్మాజీ, హర్షవర్ధన్‌, సుదర్శన్‌, పోసాని, శ్రద్ధా దాస్‌, సప్తగిరి తదితరులు కీల‌కపాత్ర‌లు పోషించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

సామాజిక మాధ్య‌మాల వేదిక‌గా త‌న సోద‌రులు, అభిమానుల‌కు సోద‌ర దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు ప్ర‌ముఖ న‌టుడు చిరంజీవి. సోమ‌వారం సోద‌రుల దినోత్స‌వం సంద‌ర్భంగా త‌న బ్రదర్స్​తో దిగిన ఫొటోను అభిమానుల‌తో పంచుకున్నారాయ‌న‌. 'తోడబుట్టిన బ్ర‌ద‌ర్స్‌కు, రక్తం పంచిన బ్ల‌డ్ బ్ర‌ద‌ర్స్‌కు హ్యాపీ బ్ర‌ద‌ర్స్ డే' అని ట్వీట్ చేశారు. ఇది వాళ్ల చిన్న‌ప్పుడు దిగిన ఫొటో. ఇందులో ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ఎత్తుకొని క‌నిపించారు చిరంజీవి. నాగ‌బాబుపై చెయ్యి వేసి నవ్వుతూ ద‌ర్శ‌న‌మిచ్చారు ప‌వ‌న్ . ప్ర‌స్తుతం ఈ ఫొటో నెట్టింట వైర‌ల్ అవుతోంది. దీన్ని చూసిన వారు కామెంట్ల రూపంలో త‌మ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

  • తోడ బుట్టిన బ్రదర్స్ కి , రక్తం పంచిన బ్లడ్ బ్రదర్స్ కి,
    Happy Brothers day! pic.twitter.com/X6kmJKTo3P

    — Chiranjeevi Konidela (@KChiruTweets) May 24, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: 'సారంగదరియా' పాట క్రేజ్​ మామూలుగా లేదుగా!

Last Updated : May 24, 2021, 9:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.