ETV Bharat / sitara

'సెల్ఫీలు అడుగుతుంటే ఇబ్బందిగా ఉంది' - జేమ్స్​ బాండ్​ హీరో వార్తలు

తమ అభిమాన హీరోలు కనిపిస్తే చాలు.. సార్, ఆటోగ్రాఫ్​ ప్లీజ్​! అనేవారు ఒకప్పుడు. ఇప్పుడు ప్రతిఒక్కరి చేతిలో ఫోన్లు రావడం వల్ల అందరూ సెల్ఫీల మాయలో పడ్డారు. అభిమాన నటులు కనిపించగానే సెల్ఫీలు దిగేందుకు పోటీపడుతున్నారు. అయితే ఇవి తనను తెగ ఇబ్బంది పెడుతున్నాయన్నాడు జేమ్స్​ బాండ్​ పాత్రధారి డేనియల్​ క్రెయిగ్​​.

i cannot surviving with these selfies and cameras, says Bond
'సెల్ఫీలు అడుగుతుంటే నరకంలా అనిపిస్తోంది'
author img

By

Published : Dec 25, 2020, 6:31 PM IST

చేతిలో మొబైల్ ఫోన్ ఉంది. అలా నడుచుకుంటూ వెళుతుండగా ఓ సినిమా హీరో మీకు కనబడితే ఏం చేస్తారు. మనలో చాలా మంది సెల్ఫీ అంటూ వారిని అడుగుతారు. కొందరు అనుమతి లేకుండా తీసుకుంటారు. అయితే అలాంటి వాటివల్ల తను నరకం అనుభవిస్తున్నానని అన్నాడు బాండ్ చిత్రాలతో గుర్తింపు పొందిన డేనియల్ క్రెయిగ్. ఈ విషయంలో తాను అనుభవిస్తున్న కష్టాలను ఓ సందర్భంలో వెల్లడించాడు.

"నాకు రాత్రి పూట సరదాగా పబ్​కు వెళ్లడం అలవాటు. అక్కడ సన్నిహితులతో ప్రశాంతంగా ఉండాలని అనుకుంటాను. కానీ అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడుతుంటారు. సెల్‌ఫోన్లు రావడం వల్లే పరిస్థితి ఇలా తయారైంది. పగలంతా ఆటోగ్రాఫ్‌లు ఇవ్వడానికి, ఫొటోలకు పోజులివ్వడానికి నాకు అభ్యంతరం లేదు. రాత్రి కూడా సెల్ఫీలు అడుగుతుంటే నరకంలా అనిపిస్తుంది"

- డేనియల్​ క్రెయిగ్, 'జేమ్స్ బాండ్' హీరో​

అనుమతి లేకుండా తారల ఫొటోలు తీసేవారి గురించి ప్రస్తావించిన క్రెయిగ్​.. ప్రస్తుతం చాలా మంది దగ్గరా కెమెరా ఉండటం వల్ల తాను ఓ సాధారణ మనిషిలా బతకలేకపోతున్నానని​ ఆవేదన వ్యక్తం చేశాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.