ETV Bharat / sitara

రవితేజతో అనిల్​ రావిపూడి మూడు సినిమాలు! - రాజా ది గ్రేట్​ సీక్వెల్​కు అనిల్​ రావిపూడి క్లారిటీ

కథానాయకుడు రవితేజతో మూడు సినిమాలు రూపొందించనున్నట్లు దర్శకుడు అనిల్​ రావిపూడి స్పష్టం చేశారు. 'క్రాక్'​ ట్రైలర్​ రిలీజ్​ ఫంక్షన్​లోని అభిమానుల సమక్షంలో అనిల్​ ఈ విషయాన్ని వెల్లడించారు.

I am Going to do three movies with Ravi Teja, Says Director Anil Ravipudi
'మాస్​ మహారాజా​తో మూడు సినిమాలు చేయబోతున్నా!'
author img

By

Published : Jan 1, 2021, 9:54 PM IST

Updated : Jan 4, 2021, 4:39 PM IST

మాస్ మహారాజా రవితేజతో త్వరలోనే మూడు సినిమాలు చేయబోతున్నట్లు దర్శకుడు అనిల్ రావిపూడి ప్రకటించారు. 'రాజా ది గ్రేట్' చిత్రానికి సీక్వెల్​ కూడా అందులో ఒకటని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం జరిగిన 'క్రాక్​' ట్రైలర్​ రిలీజ్​ ఫంక్షన్​లో అనిల్​ రావిపూడి ఈ విషయాన్ని వెల్లడించారు.

'క్రాక్​' ట్రైలర్​ రిలీజ్​ ఫంక్షన్​లో మాట్లాడుతున్న దర్శకుడు అనిల్ రావిపూడి

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ నటించిన 'క్రాక్' ప్రచార చిత్రాన్ని హైదరాబాద్ ఏఎంబీ సినిమాస్​లో అనిల్ రావిపూడి విడుదల చేశారు. ఈ చిత్రంలో రవితేజ అభిమానులకు కావల్సిన మాస్ అంశాలు పుష్కలంగా ఉన్నాయని ఆయన అన్నారు. ఆ చిత్రం సంక్రాంతి బరిలో ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సినిమాను జనవరి 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు దర్శకుడు గోపీచంద్​ మలినేని తెలిపారు.

ఇందులో రవితేజ సరసన శ్రుతి హాసన్​ నటించగా.. ఠాగూర్​ మధు నిర్మించారు. ఎస్​ఎస్​ తమన్​ స్వరాలను అందించారు.

ఇదీ చూడండి: మాల్దీవుల విహారయాత్రలో ఇషాన్​ ఖత్తర్​, అనన్య!

Last Updated : Jan 4, 2021, 4:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.