ETV Bharat / sitara

రియా చక్రవర్తి ఖాతాలోకి భారీగా నగదు బదిలీ! - Money

సుశాంత్ బ్యాంకు ఖాతా నుంచి రియా చక్రవర్తికి భారీ మొత్తంలో నగదు బదిలీ అయినట్లు వెల్లడించారు అతడి బంధువు, భాజపా ఎమ్మెల్యే నీరజ్​ కుమార్​ సింగ్​. రియాపై సుశాంత్​ తండ్రి కేసు పెట్టిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

Huge amount of money transferred into Rhea's account: Sushant's cousin
సుశాంత్​ బంధువు
author img

By

Published : Jul 29, 2020, 4:00 PM IST

Updated : Jul 29, 2020, 4:08 PM IST

బాలీవుడ్​ హీరో సుశాంత్​ రాజ్​పుత్​ బంధువు, భాజపా ఎమ్మెల్యే నీరజ్​ కుమార్​ సింగ్​ బబ్లూ ఆసక్తికర విషయాలు వెలుగులోకి తీసుకొచ్చారు. సుశాంత్​ ఖాతా నుంచి రియా చక్రవర్తి బ్యాంక్​ ఖాతాకు భారీ మొత్తంలో నగదు బదిలీ అయినట్లు తెలిపారు.

బబ్లూ, సుశాంత్​ బంధువు

"నటి రియా చక్రవర్తిపై సుశాంత్​ సింగ్​ తండ్రి కేసు పెట్టారు. ఎందుకంటే ఆమె ఖాతాలోకి పెద్ద మొత్తంలో నగదు బదిలీ అయింది. వారిద్దరికీ కలిపి కొన్ని కంపెనీల్లో ఉమ్మడి ఖాతాలు ఉన్నాయి. ఆమె వైపు నుంచి ఏదో మోసం జరిగింది. పోలీసులు ఈ విషయంపై విచారణ చేపట్టిన తర్వాత అవన్నీ బయటకు వస్తాయి."

నీరజ్​ కుమార్​ సింగ్​, భాజపా ఎమ్మెల్యే

సుశాంత్​కు ఇండస్ట్రీలో ఉన్న పరిచయాలతో, తాను నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతోనే రియా అతడితో సన్నిహితంగా మెలిగిందని సుశాంత్​ తండ్రి ఇటీవలే ఆరోపించారు. ఆమె బంధువులూ తన కుమారుడు వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారని పేర్కొన్నారు.

Last Updated : Jul 29, 2020, 4:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.