నేచురల్ స్టార్ నాని సమర్పణలో వస్తున్న క్రైమ్ థ్రిల్లర్ 'హిట్'. ఈ సినిమా టీజర్ నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. యువహీరో విశ్వక్సేన్ ఇందులో తొలిసారి పోలీస్ అధికారిగా నటిస్తున్నాడు. రుహానీ శర్మ హీరోయిన్. తప్పిపోయిన ఓ అమ్మాయిని వెతికే క్రమంలో కథానాయకుడికి ఎదురైన పరిస్థితులే ఈ చిత్ర కథాంశం.
ఈ సినిమాతో శైలేష్ కొలను దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. వివేక్ సాగర్ సంగీతమందిస్తున్నాడు. వాల్ పోస్టర్ సినిమా పతాకంపై ప్రశాంతి త్రిపురనేని నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వచ్చే నెల 28న థియేటర్లలోకి రానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">