ప్రస్తుతం చిత్రపరిశ్రమలో ఉన్న నటీమణులు.. అందమైన రూపంతో, మచ్చలేని చర్మంతో మెరిసిపోతుంటారు. ఇలాంటి అందాన్ని సాధించటానికి కొన్ని ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ పరిస్థితుల్లో శస్త్రచికిత్స, ప్లాస్టిక్ సర్జరీ బాటల్లో కొంత మంది తారలు వెళుతున్నారు. నటిగా అవకాశాల కోసం ఇలాంటి మార్గాలను ఎంచుకుంటున్నారు.
శిల్పాశెట్టి
'బాజిగార్' సినిమాతో చిత్రసీమకు పరిచయమైంది శిల్పాశెట్టి. తొలినాళ్లలో ఆమె అందంపై అనేక ట్రోల్స్ వచ్చాయి. దాని తర్వాత ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది.
![Heroines in Bollywood who swear by Cosmetic Surgery](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6375864_2.jpg)
ప్రియాంక చోప్రా
బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లోనూ తనదైన గుర్తింపు సంపాదించిన నటి ప్రియాంక చోప్రా. ఆమె ముక్కు, పెదాలకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది.
![Heroines in Bollywood who swear by Cosmetic Surgery](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6375864_3.jpg)
అనుష్క శర్మ
'రబ్ నే బనాదీ జోడీ'లో షారుఖ్‌కు జంటగా నటించిన అనుష్కశర్మ.. తన అందమైన పెదాల కోసం సర్జరీ చేయించుకుందని సమాచారం. అయితే, కరణ్ జోహార్ టాక్ షోలో దీనిపై స్పందించిన అనుష్క.. అధునాతన మేకప్‌లతో, ఇంజెక్షన్ల ద్వారా మాత్రమే పెదవులకు అందాన్ని తెచ్చుకున్నట్టు తెలిపింది.
![Heroines in Bollywood who swear by Cosmetic Surgery](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6375864_1.jpg)
కంగనా రనౌత్
బాలీవుడ్ క్వీన్ కంగనా.. పెదవులకు శస్త్రచికిత్స చేయించుకుంది. ఆమె రొమ్ము ఇంప్లాంట్ సర్జరీనూ చేయించుకుంది. దాని తర్వాత ఆమెపై ప్రత్యేక ఆకర్షణ కోసం 2011లో విడుదలైన ఓ సినిమాలో బికినీపై దర్శనమిచ్చింది.
![Heroines in Bollywood who swear by Cosmetic Surgery](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6375864_6.jpg)
మనీషా లాంబా
బాలీవుడ్ నటి మినీషా లాంబా.. తన ముక్కు శస్త్రచికిత్స చేయించుకుంది. ఆ సర్జరీ తర్వాత ఆమె రూపంలో అపురూపమైన మార్పు కనిపించింది.
![Heroines in Bollywood who swear by Cosmetic Surgery](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6375864_7.jpg)
శ్రుతి హాసన్
ప్రముఖ కథానాయకుడు కమల్‌హాసన్ కుమార్తె శ్రుతిహాసన్ ముక్కుకు శస్త్రచికిత్స జరిగింది. ఈ విషయంపై తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించింది. ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్టు అంగీకరించింది.
![Heroines in Bollywood who swear by Cosmetic Surgery](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6375864_8.jpg)
రేఖ
బాలీవుడ్ నటి రేఖ కాస్మోటిక్ సర్జరీ చేయించున్న ప్రముఖుల జాబితాలోకి వస్తుంది. ఆమె 65 ఏళ్లు ఉన్నా.. ఇప్పటికీ 35 ఏళ్ల అందగత్తెలా కనిపిస్తుంది. దక్షిణాది నటిని కావడం వల్ల బాలీవుడ్లో తనను అందంగా లేదని అనే వారని ఆమె తెలిపింది. అప్పుడు తనకు చాలా బాధ కలిగేదని వెల్లడించింది.
![Heroines in Bollywood who swear by Cosmetic Surgery](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6375864_9.jpg)
రాఖీ సావంత్
బాలీవుడ్లో వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన రాణి రాఖీ సావంత్.. తన రూపాన్ని మార్చడానికి ప్లాస్టిక్ సర్జరీ సహాయం తీసుకుంది. కొన్ని నివేదికల ఆధారంగా తను రొమ్ము ఇంప్లాంటేషన్, పెదవులకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని తెలిసింది.
![Heroines in Bollywood who swear by Cosmetic Surgery](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6375864_10.jpg)
కోయెనా మిత్రా
గతేడాది అక్టోబర్‌లో తొలిసారి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది బాలీవుడ్ నటి కోయెనా మిత్రా. చికిత్సలో అనుకోని పోరపాటు వల్ల ఆమె ఆరు నెలలు ఇంట్లోనే కూర్చోవలసి వచ్చింది.
![Heroines in Bollywood who swear by Cosmetic Surgery](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6375864_11.jpg)
ఆయేషా టకియా
బాలీవుడ్ నటి ఆయేషా టకియా అజ్మీ పెదాలకు శస్త్రచికిత్స, రొమ్ము ఇంప్లాంట్ చేయించుకుందని సమాచారం. అయితే, తాను ప్లాస్టిక్ సర్జరీ, రొమ్ము మార్పిడి చేయించుకున్నానని ఆయేషా ఎప్పుడూ అంగీకరించలేదు.
![Heroines in Bollywood who swear by Cosmetic Surgery](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6375864_5.jpg)
ఇదీ చూడండి.. ఆ విషయంలో హీరోయిన్ కంటే ప్రదీప్‌కు భయమెక్కువ!