ఇబ్బందికరమైన శీర్షికతో వీడియో పోస్టు చేసిన ఓ యూట్యూబ్ ఛానల్‌పై యువహీరో విశ్వక్సేన్ తీవ్రంగా మండిపడ్డారు. వీడియోలు పెట్టేముందు మన ఇంట్లోనూ ఆడవాళ్లు ఉన్నారనే విషయం గుర్తుంచుకుని కొంచెం ఇంగిత జ్ఞానంతో వ్యవహరించాలని అన్నారు. ఆ వీడియో పెట్టిన వ్యక్తి 24 గంటల్లో క్షమాపణలు చెబుతూ ఇంకో వీడియో పోస్టు చేయకపోతే మీ ఇంటికి వచ్చి వీడియో పెట్టిస్తానని గట్టిగా హెచ్చరించారు.
నందితశ్వేత హీరోయిన్గా నటిస్తున్న 'అక్షర' చిత్రంలోని ఓ పాట విడుదల కార్యక్రమం ఇటీవల జరిగింది. దానికి విశ్వక్సేన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా.. విశ్వక్ గురించి హీరోయిన్ నందిత మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి విశ్వక్సేన్ రావడం సంతోషంగా ఉందని.. ఆయనకు కృతజ్ఞతలు చెప్పింది. అయితే.. ఆ వీడియోను ఓ యూట్యూబ్ ఛానల్లో 'విశ్వక్.. నీకు ఏం కావాలన్నా సిగ్గులేకుండా అడుగు ఇచ్చేస్తా' అని ఇబ్బందికరమైన థంబ్‌నైల్‌తో పోస్టు చేశారు. ఇది విశ్వక్సేన్ దృష్టికి వెళ్లడం వల్ల ఆయన ఈ విషయంపై తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తూ మరో వీడియో పోస్టు చేశారు. యూట్యూబ్‌లో ఇలాంటివి సర్వసాధారణంగా మారిపోయాయంటూ చాలామంది విశ్వక్‌కు మద్దతుగా నిలుస్తున్నారు.