కన్నడ హీరో యశ్ ప్రధాన పాత్రలో నటించిన 'కేజీఎఫ్'.. దేశవ్యాప్తంగా విడుదలై సంచలనం సృష్టించింది. ప్రస్తుతం దీనికి సీక్వెల్ 'కేజీఎఫ్: చాప్టర్ 2' తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. అయితే తాజాగా ఈ సినిమా నుంచి జులై 29న ఉదయం 10 గంటలకు సర్ప్రైజ్ ఇవ్వనున్నట్లు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రశాంత్ స్పష్టం చేశాడు. క్రూరత్వాన్ని పరిచయం చేయబోతున్నాం.. అంటూ పోస్టర్‌ను పోస్ట్ చేశాడు.
-
The only way is the BRUTAL way!!#KGFChapter2@TheNameIsYash @VKiragandur@duttsanjay @SrinidhiShetty7 @TandonRaveena @bhuvangowda84 @BasrurRavi @excelmovies @AAFilmsIndia @FarOutAkhtar @ritesh_sid @VaaraahiCC @hombalefilms pic.twitter.com/pMuXZOWlQx
— Prashanth Neel (@prashanth_neel) July 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">The only way is the BRUTAL way!!#KGFChapter2@TheNameIsYash @VKiragandur@duttsanjay @SrinidhiShetty7 @TandonRaveena @bhuvangowda84 @BasrurRavi @excelmovies @AAFilmsIndia @FarOutAkhtar @ritesh_sid @VaaraahiCC @hombalefilms pic.twitter.com/pMuXZOWlQx
— Prashanth Neel (@prashanth_neel) July 27, 2020The only way is the BRUTAL way!!#KGFChapter2@TheNameIsYash @VKiragandur@duttsanjay @SrinidhiShetty7 @TandonRaveena @bhuvangowda84 @BasrurRavi @excelmovies @AAFilmsIndia @FarOutAkhtar @ritesh_sid @VaaraahiCC @hombalefilms pic.twitter.com/pMuXZOWlQx
— Prashanth Neel (@prashanth_neel) July 27, 2020
ఈ ట్వీట్ ఆధారంగా చిత్రంలో అరివీర భయంకర రాక్షసుడు 'అధీర' పాత్ర లుక్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ అధీర పాత్రలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటించారు. 29న ఆయన పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం సంజయ్ లుక్ విడుదల చేయబోతుంది.
కన్నడ, తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబరు 23న విడుదల చేయాలనుకుంటున్నారు. ఒకవేళ అన్‌లాక్ 3.0లో ప్రభుత్వం థియేటర్లకు అనుమతిస్తే, చెప్పిన తేదీకే కేజీఎఫ్ 2 థియేటర్లలో సందడి చేయనుంది. ఇందులో రాకీ భాయ్ (యశ్) సరసన శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తుండగా సంజయ్ దత్, రవీనా టాండన్, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తయింది.
ఇది చూడండి వైద్యుల పర్యవేక్షణలో అక్షయ్ 'బెల్‌బాటమ్' షూటింగ్