ETV Bharat / sitara

'అందుకే చిరు మావయ్య సినిమా టైటిల్​ వద్దన్నా' - సూపర్​ మచ్చి సినిమా అప్​డేట్​

మెగాహీరో కల్యాణ్​ దేవ్ ప్రధానపాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం 'సూపర్​ మచ్చి'. ఇటీవలే ఈ సినిమా షూటింగ్​ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను ప్రారంభించుకుంది. ఈ సందర్భంగా చిత్రంలోని విశేషాల గురించి కల్యాణ్​ దేవ్​ ముచ్చటించారు. ​

Hero Kalyan Dev Special Interview
'అందుకే చిరు మావయ్య సినిమా టైటిల్​ వద్దన్నా'
author img

By

Published : Jul 5, 2020, 8:04 AM IST

మెగాస్టార్​ చిరంజీవి అల్లుడిగా 'విజేత' చిత్రంతో తెలుగు తెరకు పరిచయయ్యారు కల్యాణ్‌ దేవ్‌. ఇప్పుడు 'సూపర్‌ మచ్చి'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. పులివాసు తెరకెక్కిస్తోన్న ఈ సినిమా చిత్రీకరణ తాజాగా పూర్తయింది. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లో మీడియాతో ముచ్చటించారు కల్యాణ్‌.

* 'సూపర్​ మచ్చి' ఓ చక్కటి ప్రేమకథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రం. కేవలం ప్రేమ అనే కాకుండా ఫ్యామిలీ డ్రామా, వినోదం, యాక్షన్​ ఇలా అన్ని భావోద్వేగాల మేళవింపుగా ఉంటుంది. ప్రతిఒక్కరూ కథకు చాలా బాగా కనెక్ట్​ అవుతారు. నేను ఈ సినిమాలో ఓ బార్​ సింగర్​గా కనిపిస్తా. అందులో తెలుగు సినిమా పాటలు పాడుతుంటా.

* ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్ని ఓ సవాల్‌గా తీసుకుని 'సూపర్‌ మచ్చి' చిత్రీకరణ పూర్తి చేయడం గర్వంగా అనిపిస్తోంది. ఈ షెడ్యూల్‌ ఆద్యంతం ఎంతో ఆస్వాదించా. ప్రభుత్వ మార్గదర్శకాలకు తగ్గట్లుగా చిత్రబృందం సెట్లో అన్ని ఏర్పాట్లు చక్కగా పూర్తి చేసింది. ఈ షెడ్యూల్‌లో ఓ డ్రీమ్‌ సాంగ్‌ను చిత్రీకరించాం.

Hero Kalyan Dev Special Interview
'సూపర్​ మచ్చి' ఫస్ట్​లుక్​

* మొదటి నుంచి కథల ఎంపికలో నేనే నిర్ణయం తీసుకునే వాడిని. దీని కోసం నాకిద్దరు సహాయకులు ఉన్నారు. నాకు సరిపడిన కథ ఏదైనా వస్తే వాళ్లు నా దగ్గరకు పంపుతారు. నేనది విని నచ్చితే.. దానిలో చిన్న చిన్న మార్పులేమైనా ఉంటే చేయిస్తా. ఫైనల్​గా మావయ్య దగ్గరకు తీసుకెళ్తా. అయితే అన్ని సార్లు కథ వినే తీరిక మావయ్యకు దొరక్కపోవచ్చు.

* ఇది చక్కటి ప్రేమకథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రం. ప్రేమ అనే కాకుండా ఫ్యామిలీ డ్రామా, వినోదం, యాక్షన్‌ ఇలా అన్ని భావోద్వేగాల మేళవింపుగా ఉంటుంది. ఈ చిత్రాన్ని థియేటర్‌...ఓటీటీ...దేనిలో విడుదల చేయాలనేది నిర్మాత ఇష్టం.

"చిరంజీవి, పవన్​ కల్యాణ్​ మావయ్యల సినిమాలు రీమేక్​ చేసే సాహసం చేయలేను. మెగా హీరోల్లో ఎవ్వరూ ఆ ఆలోచన కూడా చేయరనుకుంటా. ఎందుకంటే వాళ్లంతా లెజెండ్స్​, వాళ్ల చిత్రాల్ని రీమేక్​ చేసి, వాళ్లను రీప్లేస్​ చేయడం మాకు పాజిటివ్​ కన్నా నెగిటివే ఎక్కువ అవుతుంది. నా తొలి చిత్రానికి చిరు మావయ్య 'విజేత' టైటిల్​ పెడుతుంటేనే నేనసలు వద్దన్నాను. కానీ, కథకు సరిపోతుంది. నువ్వు పెద్దగా టెన్షన్​ పడుకు అని మావయ్య ధైర్యం చెప్పి ఆ టైటిల్​ పెట్టించారు. ఒకవేళ వాళ్ల చిత్రాల్లోని పాటలు రీమేక్​ చేయాల్సి వస్తే అది దర్శకుల ఇష్టం".

* 'సూపర్‌ మచ్చి' తర్వాత రచయిత శ్రీధర్‌ సీపాన దర్శకత్వంలో ఓ సినిమా చేస్తా. ఈ చిత్రాన్ని జీఏ2, అభిషేక్‌ పిక్చర్స్‌, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీస్‌ నిర్మిస్తాయి. మరో కొత్త దర్శకుడితోనూ ఓ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నా.

* స్టార్‌ హీరోలు వెబ్‌సిరీస్‌లు చేస్తే ఎవరూ జడ్జ్‌ చేయరు. కానీ మాలాంటి కొత్త హీరోలు వెబ్‌సిరీస్‌ల్లోకి వస్తే.. మాకు దాని వల్ల నష్టమే ఎక్కువ. నేను చేసింది ఇప్పటికీ ఒక చిత్రమే. ఇప్పుడే వెబ్‌సిరీస్‌ల్లోకి వస్తే అవకాశాలు లేక ఇటు వైపు వచ్చానేమో అనే ఆలోచన ప్రేక్షకుల్లో కలిగే ప్రమాదం ఉంది.

ఇదీ చూడండి... వివాదంలో అక్షయ్ కుమార్ 'హెలికాప్టర్ పర్యటన'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.