ప్రముఖ కథానాయకుడు జూ.ఎన్టీఆర్.. అభిమానులకు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు. దీనితో పాటే తన కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ క్యూట్ ఫొటోల్ని పోస్ట్ చేశారు. వీటిని చూసిన నెటిజన్లు.. ఎంత ముద్దొస్తున్నారో అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' షూటింగ్లో తారక్ బిజీగా ఉన్నారు. ఇందులో రామ్చరణ్ మరో హీరోగా నటిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. వచ్చే ఏడాది ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

- " class="align-text-top noRightClick twitterSection" data="
">