ETV Bharat / sitara

సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్​ దందాపై సుదీప్ స్పందన - కన్నడ చిత్రపరిశ్రమలో డ్రగ్స్​

చిత్రపరిశ్రమలో డ్రగ్స్​ రాజ్యమేలుతున్నాయన్న విషయం తనకు అసలు తెలియదని చెప్పారు కన్నడ సూపర్​స్టార్​ సుదీప్​. ఇలాంటి చర్యలతో ఇండస్ట్రీకి చెడ్డపేరు తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు.

Here's what Kichcha Sudeep has to say on 'drug abuse' in Kannada film industry
సుదీప్
author img

By

Published : Sep 2, 2020, 10:21 AM IST

కన్నడ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్​ దందా విషయమై మాట్లాడాడు ప్రముఖ నటుడు సుదీప్. ఇది తనకు అసలు తెలియదని అన్నారు. ఇలాంటి పనులతో ఇండస్ట్రీకి చెడ్డపేరు తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు. డ్రగ్స్​ రాకెట్​ కేసులో శాండల్​వుడ్​కు చెందిన ముగ్గురు వ్యక్తుల్ని ఇటీవలే అరెస్ట్​ చేశారు నార్కోటిక్స్​ కంట్రోల్​ బ్యూరో.

"నాకు తెలిసిందే చెబుతాను. నేను కూడా ఇండస్ట్రీకి చెందినవాడినే. డ్రగ్ రాకెట్ గురించి నాకు అసలు తెలియదు. ఎక్కువ మంది స్నేహితులు లేని కారణంగా అలాంటి వాటి గురించి నాకు అవగాహన లేదు" - సుదీప్, కన్నడ సూపర్​స్టార్​

డ్రగ్స్​ ప్రభావంతో రాష్ట్రంలోని యువత చెడిపోతున్నారని, పలు రంగాలు డ్రగ్స్​ మాఫియా గుప్పిట్లో ఉన్నాయని ముఖ్యమంత్రి యడియూరప్పకు మెమోరాండంను సమర్పించారు సినీనటి, బీజేపీ నాయకురాలు అనురాధ. మరణశిక్ష లాంటి కఠిన చట్టాలు మాత్రమే ఈ సమస్యకు పరిష్కారమని ఆమె పేర్కొన్నారు.

దీనిని పరిగణలోకి తీసుకున్న కేంద్ర నేరపరిశోధన సంస్థ, దర్యాప్తు చేపట్టింది. సినీప్రముఖుడు ఇంద్రిజిత్​ లంకేశ్​కు సోమవారం సమన్లు జారీ చేసింది. విచారణకు హాజరైన లంకేశ్​ను అధికారులు దాదాపు ఐదు గంటలపాటు ప్రశ్నించగా.. చిత్రపరిశ్రమలో ఎంతోమంది డ్రగ్స్​ బారిన పడ్డారని తెలిపారు. కన్నడ చిత్రపరిశ్రమకు చెందిన 15 మంది ఈ రాకెట్​లో ఉన్నారని వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.