ETV Bharat / sitara

ఓనం వేడుకల్లో ముద్దుగుమ్మల హొయలు - onam festival

ఓనం పండగ సందర్భంగా అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు పలువురు సెలబ్రిటీలు. కొత్తు దుస్తుల్లో కనువిందు చేసి, ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్​ చేశారు.

special occasion
తారల
author img

By

Published : Aug 31, 2020, 4:46 PM IST

మలయాళీలకు అత్యంత ప్రీతిపాత్రమైన పండుగ ఓనం. ఆగస్టు-సెప్టెంబర్‌ నెలలో వచ్చే ఈ పండుగను పదిరోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా కేరళలో ఎక్కడ చూసినా.. ఏనుగుల స్వారీలు, తెల్లటి దుస్తుల్లో మగువలు, రకరకాల పూలతో సుందరంగా చేసిన అలంకరణలు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఈ పండుగ రోజున మలయాళీలు నిర్వహించే ఓనం సద్యా అనే విందు చాలా ముఖ్యమైనది. దీనిలో భాగంగా అరటి ఆకులపై పలు రకాల ఆహార పదార్థాలు వడ్డిస్తారు. సంప్రదాయ ఊరగాయలు, అప్పడాలు, పాయసంతో పాటు రకరకాల పిండి వంటలను చేసుకుని కుటుంబమంతా ఆరగిస్తారు.

ఓనం సందర్భంగా ప్రజలు వారి ఇంటి ముందు రంగురంగుల పూలతో ముగ్గు వేసి ఆ మధ్యలో దీపం వెలిగిస్తారు. దీన్ని పూక్కలం అంటారు. ముఖ్యంగా ఆడపిల్లలు రకరకాల పువ్వులను సేకరించి వాటితో ఇంటి ముందు అందమైన ముగ్గు వేస్తారు. రంగవల్లులపై ఓనం రోజున పోటీలు కూడా నిర్వహిస్తారు. ఓనం సందర్భంగా పలువురు సెలబ్రిటీలు అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. వీరిలో స్టార్ హీరో మోహన్​లాల్, పృథ్వీరాజ్​, కమల్​హాసన్​, ప్రియమణి సహా పలువురు సెలబ్రిటీలు ఉన్నారు. నూతన వస్త్రాల్లో కనువిందు చేస్తూ.. వాటిని సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. వాటిని మీరు ఓ లుక్కేయండి.

anupama
అనుపమ
mohan
మంజిమ మోహన్​
actress
నటి
priyamani
ప్రియమణి
arora
మలైకా అరోరా
priyadarsan
కల్యాణి ప్రియదర్శన్​
bollama
వర్ష బొల్లమ్మ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.