ETV Bharat / sitara

ప్రియాంక.. అందంలోనే కాదు ప్రతిభలోనూ మేటి - ప్రియాంక చోప్రా పుట్టినరోజు

ప్రియాంకా చోప్రా.. బాలీవుడ్​లో తనకంటూ గుర్తింపు తెచ్చుకుని హాలీవుడ్​లోనూ అవకాశాలు దక్కించుకుంది. ప్రస్తుతం తన భర్త నిక్ జోనస్​తో కలిసి లాక్​డౌన్ కాలాన్ని ఎంజాయ్ చేస్తోంది. నేడు ఈ అందాల సుందరి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం మీకోసం.

ప్రియాంక.. అందంలోనే కాదు ప్రతిభలోనూ మేటి

author img

By

Published : Jul 18, 2020, 5:34 AM IST

అందమైన అమ్మాయి. అందాల కిరీటం వరించిన అమ్మాయి. ఇంకేం... సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. తలపైకి అందాల కిరీటం వచ్చిందని తెలిస్తే చాలు... సినిమా అవకాశాలు తలుపుతడుతుంటాయి. అది సర్వసాధారణం. అలాగని ఆ అందాల ముద్దుగుమ్మలంతా తెరపై రాణిస్తారనుకుంటే పొరపాటే. కొద్దిమందే తమలోని నటనా ప్రతిభను ప్రదర్శిస్తారు. అలా గుర్తింపు తెచ్చుకొన్న అందాల నాయిక... ప్రియాంకా చోప్రా. ఈరోజు ఈ జాతీయ ఉత్తమ నటి పుట్టినరోజు సందర్భంగా ఆమె జీవితంలోని కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం.

ప్రియాంకా చోప్రా
ప్రియాంకా చోప్రా

లిటిల్‌ డాటర్‌..

ఝార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో (18 July 1982) పుట్టింది ప్రియాంకా చోప్రా. నాన్న అశోక్‌ చోప్రా, అమ్మ మధు చోప్రా. ఇద్దరూ వైద్యులే. అశోక్‌ చోప్రా ఇండియన్‌ ఆర్మీలో కెప్టెన్‌ హోదాలో పనిచేశారు. ఆయన 2013లో మరణించారు. ప్రియాంకకు తన తండ్రి అంటే ఎంతో ఇష్టం. అందుకే చేతిపై డాడ్స్‌ లిటిల్‌ డాటర్‌ అని ఓ పచ్చబొట్టు రాయించుకుంది. అమ్మ మధు చోప్రా గైనకాలజిస్ట్‌. ప్రియాంకకు సిద్ధార్థ్‌ అనే ఓ తమ్ముడున్నాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

అమెరికాలో..

ఉద్యోగరీత్యా వీరి కుటుంబం దేశంలోని పలు నగరాలకు వెళ్లాల్సి వచ్చింది. ప్రాథమిక విద్య కోసం లఖ్​నవూలోని లా మార్టినియర్‌ గర్ల్స్‌ స్కూల్‌లో చేరింది ప్రియాంక. ఆ తర్వాత అమెరికాలోని మసాచుసెట్స్‌లో ఉన్న తన అత్త దగ్గరికి వెళ్లింది. అక్కడే న్యూటన్‌ నార్త్‌ హై స్కూల్‌లో చదువుకుంది. కొన్నాళ్ల తర్వాత నార్త్‌ డెల్టా సీనియర్‌ స్కూల్‌కి మారింది. అక్కడ నుంచి మళ్లీ ఇండియాకు వచ్చి బరేలీలోని ఆర్మీ స్కూల్‌లో చదువుకుంది. ప్లస్‌ టు కోసం ముంబయిలోని జైహింద్‌ కళాశాలలో చేరింది.

ప్రియాంకా చోప్రా
ప్రియాంకా చోప్రా

ఎన్నెన్ని కళలో..

ప్రియాంకా చోప్రా కేవలం నటి మాత్రమే కాదు. ఆమెలో ఓ గాయని ఉంది. రచయిత ఉంది. ఓ ఆంగ్ల పత్రికలో ఫ్యాషన్‌కి సంబంధించిన వ్యాసాలు రాసింది. అలాగే పలు చిత్రాల్లో పాటలు పాడింది. స్ప్రింగ్‌ డేల్స్‌ పాఠశాల పుస్తకాల్లో ప్రియాంక జీవితాన్ని ఓ పాఠంగా చేర్చారు. మన దేశంలో అలా పాఠంగా మారిన తొలి కథానాయిక ప్రియాంకనే. ఆమె కుటుంబ సభ్యులతో కూడిన ఫొటోలతో ఆ పాఠాన్ని ప్రచురించారు.

కళాశాల వదిలి..

బరేలీలో చదువుకొంటున్నప్పుడే ప్రియాంక చోప్రా 'మే క్వీన్‌'గా ఎంపికైంది. ఆ తర్వాత ఫెమినా మిస్‌ ఇండియా పోటీల్లో పాల్గొంది. అందులో కిరీటం దక్కించుకొంది. ఆ తర్వాత మిస్‌ ఇండియా వరల్డ్‌, మిస్‌ వరల్డ్‌గా ఎంపికైంది. ఇంజినీరింగ్‌ చదువుకోవాలనుకున్న ప్రియాంక.. కళాశాల చదువులను మధ్యలోనే వదిలేసి అందాల ప్రపంచంలోకి అడుగుపెట్టింది. 2000వ సంవత్సరంలో మిస్‌ వరల్డ్‌ కిరీటం దక్కగానే ప్రియాంకకు సినిమా అవకాశాలు తలుపుతట్టాయి.

ప్రియాంకా చోప్రా
ప్రియాంకా చోప్రా

అక్కడ్నుంచి లోయ..

"జీవితంలో ఎన్ని ప్రదేశాలు తిరిగినా నాకు సొంతూరులా అనిపించేది మాత్రం బరేలీనే. అక్కడ గడిపిన రోజులు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. జమ్ము కశ్మీర్‌లో గడిపిన చిన్ననాటి రోజులు ఎంతో మధురానుభూతిని కలిగిస్తుంటాయి. నేను నాలుగో తరగతి చదువుతున్నప్పుడు మా నాన్నకు కశ్మీర్‌కు బదిలీ అయింది. అక్కడ ఆర్మీ కుటుంబాల్లోని పిల్లలతో గడిపిన రోజులు నాకు ఇప్పటికీ గుర్తు. అక్కడి లోయలు భలే ఆహ్లాదాన్ని పంచేవి. లేహ్‌లో ఒక పెద్ద స్థూపం ఉండేది. ఆ స్థూపంపైకి ఎక్కి ఆడుకునేవాళ్లం. అక్కడ్నుంచి చుట్టూ ఉన్న లోయలు చూస్తూ ఆస్వాదించేవాళ్లం’.

నటిగా గుర్తింపు..

తొలినాళ్లల్లో నటిగా ప్రియాంకకు ఎదురు దెబ్బలు తగిలాయి. చాలా సినిమాలు పరాజయాన్ని చవిచూశాయి. అయితే తన అందంతో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను కట్టిపడేసే ప్రయత్నం చేసింది. 'ఐత్‌రాజ్‌' సినిమాలో వ్యతిరేక ఛాయలున్న పాత్ర చేసింది. ఆ తర్వాత 'క్రిష్‌', 'డాన్‌' చిత్రాలు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. 'క్రిష్‌'లో ప్రియాంక పాత్ర చిన్నదే అయినా... చక్కటి ఆదరణ లభించింది. 'ఫ్యాషన్‌', 'దోస్తానా' చిత్రాలతో అమ్మడి పేరు బాలీవుడ్‌లో మార్మోగిపోయింది. 'ఫ్యాషన్'’ సినిమాలో మోడల్‌ పాత్రలో జీవించింది. అప్పట్నుంచి ప్రియాంకకు చాలావరకు నటనకు అవకాశమున్న పాత్రలే దక్కాయి. 'సాత్‌ ఖూన్‌ మాఫ్‌'లో పలు రకాలుగా తెరపై కనిపించింది. 'బర్ఫీ'లో మతిస్తిమితం సరిగా లేని యువతిగా నటించి పలు పురస్కారాలు సొంతం చేసుకుంది.

ప్రియాంకా చోప్రా
ప్రియాంకా చోప్రా

బంధం.. అనుబంధం..

ప్రియాంక వ్యక్తిగత జీవితం పలుమార్లు వార్తల్లో నిలిచింది. ఆమె నటుడు హర్మన్‌ బవేజాతో సన్నిహితంగా మెలిగింది. వారిద్దరూ కలిసి కొన్నాళ్లపాటు చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఆ తర్వాత ఇద్దరికి కటీఫ్‌ అయింది. మధ్యలో కొన్నాళ్లు షాహిద్‌ కపూర్‌తో ప్రేమాయణాన్ని సాగించింది. 'డాన్‌ 2' సమయంలో షారుఖ్‌ ఖాన్‌తోనూ ప్రేమలో పడిందని ప్రచారం సాగింది. ప్రస్తుతం హిందీలో కథానాయికగా నటిస్తున్న పరిణీతి చోప్రా వరుసకి ప్రియాంకకు చెల్లెలవుతుంది. ప్రియాంకకు తెలుగు చిత్ర పరిశ్రమతోనూ అనుబంధం ఉంది. ఆమె ఇక్కడ 'అపురూపం' అనే ఓ సినిమాలో నటించింది. అయితే ఆ చిత్రం విడుదలకు నోచుకోలేదు. ఆ తర్వాత పలుమార్లు తెలుగు చిత్రాల్లో నటించాలని ప్రయత్నించినా కుదరలేదు. ఆ మధ్య రామ్‌చరణ్‌తో కలిసి 'తుఫాన్‌' చిత్రంలో ఆడిపాడింది. కానీ ఆ చిత్రం సరైన విజయాన్ని సాధించలేదు. అవకాశం వస్తే మళ్లీ తెలుగులో నటిస్తానని చెబుతుంటుంది ప్రియాంక.

హాలీవుడ్ పాప్ సింగర్ నిక్ జోనస్​ను వివాహమాడిన ప్రియాంక.. బాలీవుడ్​కు కాస్త విరామం ప్రకటించింది. ఇటీవల విడుదలైన స్కై ఈజ్ పింక్​ చిత్రంతో మళ్లీ హిందీ పరిశ్రమలో పునరాగమనం చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.