ETV Bharat / sitara

గొల్లపూడి మారుతీరావు సినీ ప్రస్థానం సాగిందిలా

టాలీవుడ్ సీనియర్ నటుడు, రచయిత, వ్యాఖ్యత గొల్లపూడి మారుతీరావు.. 80 ఏళ్ల వయసులో చెన్నైలో గురువారం తుదిశ్వాస విడిచారు. తన సినీ కెరీర్​లో దాదాపు 300 చిత్రాల్లో వివిధ పాత్రలు పోషించి ప్రేక్షకుల్ని సమ్మోహనపరిచారు.

గొల్లపూడి మారుతీరావు సినీ ప్రస్థానం సాగిందిలా
నటుడు, రచయిత, వ్యాఖ్యత గొల్లపూడి మారుతీరావు
author img

By

Published : Dec 12, 2019, 2:47 PM IST

Updated : Dec 12, 2019, 5:02 PM IST

గొల్లపూడి మారుతీరావు..... తెలుగు సినిమా చరిత్రలో ఈ పేరుకో ప్రత్యేకత ఉంది. కాసింత విలనిజం, మరికొంత కుత్సితం, ఇంకొంత హాస్యం కలగలిపితే... ఆయన సినిమాలో పోషించిన పాత్రలు ప్రాణం పోసుకుంటాయి. కడుపుబ్బ నవ్వించే కామెడీ అయినా.. విషం కక్కే విలనిజం అయినా... కంటతడి పెట్టించే కరుణరసమైనా... నటవిశ్వరూపాన్ని చూపించగల నటుడు గొల్లపూడి.

GOLLAPUDI MARUTHI RAO
గొల్లపూడి మారుతీరావు

మధ్య తరగతి ఇంటి పెద్దగా... దారి తప్పిన మధ్య వయస్కుడిగా.. కాళ్లూ చేతులూ బావున్నా ఎవరో ఒకరిని మోసం చేసే మాయగాడి పాత్రల్లో గొల్లపూడి వెండితెరపై జీవించారు. గద్దముక్కుపంతులు అన్నా.. సింగిల్ పూరీ శర్మ అన్నా చటుక్కున ఆ పాత్రలే గుర్తొస్తాయి తప్ప.. గొల్లపూడి కానే కాదు. డైలాగ్ డెలివరీలో తనకంటూ ప్రత్యేక శైలి సృష్టించుకున్న గొల్లపూడి... ఒక్కోమాటను విరుస్తూ మాటలు చెబుతుంటే వెండితెర సైతం ఆస్వాదించేది.

తొలి ప్రయత్నంలోనే నంది అవార్డు

తెలుగు సినీ చరిత్రలో 80వ దశకంలో ఎన్నో సినిమాల్లో తనదైన విలనిజం చూపించిన నటుడు గొల్లపూడి మారుతీరావు. తర్వాత పలు విలక్షణ పాత్రల్లో నటించి మెప్పించారు. ప్రముఖ కవి దాశరథి ప్రోత్సాహంతో సినీ రచయితగా మారిన గొల్లపూడి మారుతీరావు... తొలిసారి 1963లో 'డాక్టర్ చక్రవర్తి' చిత్రానికి స్క్రీన్ ప్లే రాశారు. తొలి ప్రయత్నంలోనే ఆ కథారచనకు నంది అవార్డు లభించింది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కిన ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య' చిత్రం ద్వారా నటుడిగా సినీ రంగ ప్రవేశం చేశారు.

GOLLAPUDI MARUTHI RAO
మెగాస్టార్ చిరంజీవితో గొల్లపూడి మారుతీరావు

సింగిల్​ పూరీ శర్మ.. గద్దముక్కు పంతులు ఈయనే

ఆ తర్వాత దాదాపు 290 చిత్రాలకు పైగానే సహాయ నటుడిగా, హాస్య నటుడిగా, విలన్ గా వివిధ పాత్రల్లో మెప్పించారు. 42 ఏళ్ల వయసులో మొదటి సినిమాలో నటించిన గొల్లపూడి.. మూడున్నర దశాబ్దాలకుపైగా ఎన్నో పాత్రలకు జీవం పోశారు. గొల్లపూడికి దర్శకుడు కోడి రామకృష్ణ పెట్టిన గద్దముక్కు పంతులు పేరు చాలా ప్రాచుర్యం పొందింది. ఆ తర్వాత 'సుందరకాండ'లో దర్శకుడు రాఘవేంద్రరావు ఆయన్ని సింగిల్ పూరీ శర్మగా మార్చారు.

ఒక్క ఏడాదిలో 31 సినిమాలు

రావు గోపాలరావు, అల్లు రామలింగయ్యతో పాటు సహ విలన్‌గా గొల్లపూడి ఎన్నో సినిమాల్లో విలనిజం పండించారు. ఈ దుష్ట త్రయం ఎన్నో సినిమాల్లో ప్రేక్షకులను అలరించింది. ఒక దశలో గొల్లపూడి ఒక్క సంవత్సరంలోనే 31 సినిమాల్లో నటించారంటే ఆయన నటనలో ఎంతగా రాణించారో అర్థం చేసుకోవచ్చు.

GOLLAPUDI MARUTHI RAO
గొల్లపూడి మారుతీరావు

గొల్లపూడి సినిమాల జాబితా ఇదే

తన మూడో చిత్రంలోనే గొల్లపూడి ద్విపాత్రాభినయం చేశారు. సంసారం ఒక చదరంగం, తరంగిణి, త్రిశూలం, మనిషికో చరిత్ర, యముడికి మొగుడు, స్వాతిముత్యం, స్వాతి, గూఢచారి నెంబర్ వన్, ఆలయ శిఖరం, అభిలాష, పల్లెటూరి మొనగాడు, ఛాలెంజ్, ప్రేమ, ఆదిత్య 369, అసెంబ్లీ రౌడీ, ముద్దుల ప్రియుడు, సుందరకాండ, బ్రోకర్, లీడర్, వజ్రం, మురారి, దరువు, సుకుమారుడు, రౌడీ ఫెలో, కంచె, సైజ్ జీరో, మనమంతా, ఇజం వంటి మరికొన్ని చిత్రాల్లోనూ గొల్లపూడి ఆకట్టుకున్నారు. ఆయన నటించిన చివరి చిత్రం 'జోడి'.

రచయితగా గొల్లపూడి.. బుల్లితెరపైనా నట ప్రస్థానం

'డాక్టర్ చక్రవర్తి' సినిమాతో రచయితగా సినీ రంగంలో ప్రవేశించిన గొల్లపూడి... రైతు కుటుంబం, దొరబాబు, ఓ సీత కథ, అన్నదమ్ముల అనుబంధం, శుభలేఖ, కళ్లు వంటి చిత్రాలకు కథ అందించారు. వెండితెరపైనే కాకుండా... బుల్లి తెరపైనా గొల్లపూడి నటనా ప్రతిభ ప్రకాశించింది. ఇంటింటి రామాయణం, గణపతి, ఎవరిగోల వారిదే, ప్రేమలు పెళ్ళిళ్ళు, భార్యా రూపవతీ శత్రు, ఏది నిజం? వంటి సీరియళ్లలో నటుడిగా మెప్పించారు.

GOLLAPUDI MARUTHI RAO
గొల్లపూడి మారుతీరావు

6 నంది పురస్కారాలు

గొల్లపూడి మొత్తం 6 నంది పురస్కారాలు అందుకున్నారు. డాక్టర్ చక్రవర్తి, ఆత్మగౌరవం చిత్రాలకు ఉత్తమ కథా రచయితగా.... తరంగిణి చిత్రంలో ఉత్తమ హాస్యనటుడిగా.. 'రామాయణంలో భాగవతం' చిత్రానికి ఉత్తమ సహాయనటుడిగా నందులు అందుకున్నారు. తన చిన్నకుమారుడు దర్శకత్వం వహించిన ప్రేమపుస్తకం చిత్రానికి ఉత్తమ స్క్రీన్ ప్లేకు నంది అందుకున్న ఆయన.. 1996లో ఉత్తమ టీవీ నటుడిగా బుల్లితెర నంది పురస్కారం స్వీకరించారు.

కుమారుడు పేరిట జాతీయ అవార్డు

1992 ఆగస్టు 12న మారుతీరావు చిన్న కుమారుడు గొల్లపూడి శ్రీనివాస్, తన తొలి ప్రయత్నంగా ప్రేమ పుస్తకం అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తూ చిత్రీకరణ సమయంలో మరణించారు. తన కుమారుని జ్ఞాపకంగా మారుతీరావు... గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ అవార్డు నెలకొల్పి, ఏటా ఉత్తమ నూతన సినిమా దర్శకునికి లక్షన్నర రూపాయల నగదు బహుమతిని అందించారు.

ఈటీవీలో వ్యాఖ్యతగా

ఈటీవీ ప్రతిధ్వని కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన గొల్లపూడి... పలువురు ప్రముఖుల్ని ఇంటర్య్వూ చేశారు. మనసున మనసై, ప్రజావేదిక, సినీ సౌరభాలు తదితర కార్యక్రమాలకూ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

GOLLAPUDI MARUTHI RAO
ఈనాడు-ఈటీవీ సంస్థల అధినేత రామోజీరావుతో గొల్లపూడి మారుతీరావు

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Gauhati - 11 December 2019   
++NIGHT SHOTS++
1. Various of burning vehicles on the street
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Gauhati - 12 December 2019
++DAY SHOTS++
2. Bonfire of waste material on a road
3. Various of burnt vehicles on streets
4. Various of inside of a burnt bus
5. Various of armed police officers
STORYLINE:
Police arrested dozens of people and enforced a curfew on Thursday in several districts in India's northeastern Assam state where thousands protested legislation granting citizenship to non-Muslims who migrated from neighboring countries.
Groups of protesters defied the curfew in Gauhati, the state capital, early Thursday and burned tires before police dispersed them.
Protesters oppose the legislation, approved by Parliament on Wednesday, out of concern that migrants will move to the border region and dilute the culture and political sway of indigenous tribal people.
The Press Trust of India news agency said the protesters uprooted telephone poles, burned several buses and other vehicles and also attacked homes of officials from the governing Hindu nationalist party and regional group Assam Gana Parishad.
Police used batons and tear gas to disperse protesters in 10 out of the state's 33 districts.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Dec 12, 2019, 5:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.