ETV Bharat / sitara

పెళ్లి తర్వాత హాసిని రీఎంట్రీ.. ఇద్దరు హీరోలతో! - genelia d'souza latest new

హాసిని మరోసారి తెలుగు తెరపై సందడి చేయనుందట. అదేనండి జెనీలియా మరోసారి ముఖానికి రంగేసుకోవడానికి సిద్ధమవుతోందట. మెగాస్టార్ చిరంజీవి లూసిఫర్​తో పాటు ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాలో నటించనుందని సమాచారం.

జెనీలియా
జెనీలియా
author img

By

Published : May 21, 2020, 5:31 AM IST

చలాకీతనంతో అందరి దృష్టిని ఆకర్షించిన నాయిక జెనీలియా. హా..హా.. హాసిని అంటూ చేసిన సందడి అంతా ఇంతా కాదు. అయితే వివాహం అనంతరం ఈ భామ నటనకు దూరంగా ఉంది. రీ ఎంట్రీ ఇస్తుందని ఎప్పటి నుంచో వార్తలొస్తున్నాయి. తాజాగా ఆమె రీ ఎంట్రీకి సంబంధించి ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి.

చిరంజీవి కథానాయకుడిగా 'లూసిఫర్‌' రీమేక్‌ తెరకెక్కనుంది. సుజిత్‌ దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. ఇందులో ముఖ్యమైన పాత్ర ఉందని, దానికోసం జెనీలియాను సంప్రదిస్తున్నట్లు టాలీవుడ్‌లో ప్రచారం సాగుతోంది.

జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ఓ సినిమా ప్రకటించారు. ఈ కథను మలుపు తిప్పే కీలకపాత్ర కోసం కూడా జెనీలియాను ఎంపిక చేసే అవకాశాలున్నాయని టాక్​. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.