ETV Bharat / sitara

ఆలియా భట్ కొత్త సినిమా సెట్ కూల్చివేత - గంగూబాయ్​ చిత్రం తాజా వార్తలు

హీరోయిన్ ఆలియా భట్ నటిస్తున్న 'గంగూబాయ్' సినిమా సెట్​ను కూల్చివేసేందుకు చిత్రబృందం సిద్ధమైంది. లాక్​డౌన్ వల్ల అద్దె భారం పెరుగతుండటమే ఇందుకు కారణమని తెలిపింది.

'Gangubai Kathiawadi': Sets of Alia Bhatt starrer to be demolished for being unused?
ఆలియా భట్​
author img

By

Published : Apr 23, 2020, 1:33 PM IST

'ఆర్ఆర్ఆర్' హీరోయిన్​ ఆలియాభట్.. హిందీలో 'గంగూబాయ్' అనే బయోపిక్​లో టైటిల్ రోల్​లో నటిస్తోంది. ముంబయిలోని ఓ స్టూడియోలో చాలా రోజుల క్రితమే షూటింగ్​ ప్రారంభమైంది. లాక్​డౌన్ వల్ల దానిని మార్చిలోనే నిలిపేశారు. అయితే ఈ సినిమా కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఓ సెట్​కు అద్దెభారం పెరుగుతూ వస్తోంది. ఈ కారణంతో దానిని కూల్చివేయాలని చిత్రబృందం నిర్ణయం తీసుకుంది.​

"లాక్​డౌన్​ ప్రకటించాక షూటింగ్ వాయిదా పడింది. ఓ నెలలో మళ్లీ మొదలవుతుందని అనుకున్నాం. కానీ ముంబయిలో పరిస్థితుల వల్ల చిత్రీకరణ ఇప్పట్లో జరిగే అవకాశం కన్పించట్లేదు. ఫిల్మ్​సిటీలోని సెట్​కు ప్రతిరోజూ అద్దె చెల్లించే కన్నా, కొత్త సెట్​ను నిర్మిస్తే.. దాని ఖర్చు తక్కువవుతుంది. అందువల్ల సెట్​ను నేలమట్టం చేయాలని చిత్రబృందం నిర్ణయించుకుంది" - చిత్రబృందంలోని ఓ ప్రతినిధి

ముంబయికి చెందిన రౌడీరాణి గంగూబాయ్‌ కతియావాడి జీవితం ఆధారం ఈ సినిమా తీస్తున్నారు. ఇందులో వేశ్య పాత్రలో కనిపించనుంది ముద్దుగుమ్మ ఆలియా​. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే వచ్చిన ఫస్ట్​లుక్స్.. చిత్రంపై అంచనాల్ని పెంచుతున్నాయి.

ఇదీ చూడండి : 'గంగూబాయ్​' పాత్రలో మెప్పిస్తోన్న ఆలియా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.