ETV Bharat / sitara

స్నేహానికి సరికొత్త భాష్యం చెప్పిన సినిమాలు ఇవే!

నిక్కర్ వేసుకునే వయస్సు నుంచి జీన్స్ వేసే వరకూ.. చాక్లెట్​ను సగం సగం పంచుకునే చిన్నతనం నుంచి.. బిర్యానీ తినే వరకూ..సైకిల్​ ప్రయాణం నుంచి బైక్​పై.. తిరిగే వరకూ.. కాలేజీ​లో చిలిపి చేష్టల నుంచి జీవితంలో స్థిరపడే వరకూ ఇలా ప్రతి చోట ఆనందాన్ని, బాధను పంచుకునేది స్నేహితుడు. అలాంటి మిత్రులు జరుపుకొనే స్నేహితుల దినోత్సవం సందర్భంగా టాలీవుడ్​లో ఫ్రెండ్​షిప్​ నేపథ్యంలో వచ్చిన మూవీలపై ఓ లుక్కేద్దాం.

telugu movies that celebrated friendship
ఫ్రెండ్​షిప్​ మూవీలు
author img

By

Published : Aug 1, 2021, 5:32 AM IST

అమ్మ-నాన్న, అక్కా, చెల్లి, అన్న, తమ్ముడు ఇలా ఎన్నో బంధాలతో మనల్ని కలిపిన దేవుడు స్నేహితుడిని ఎందుకు దూరం పెట్టాడో అర్థం కాదు. ఆలోచిస్తే అది బంధం కాదు భావోద్వేగమని అర్థమౌతుంది. పరీక్షల్లో ఫెయిలైతే 'లైట్​ రా' అంటూ ధైర్యం చెబుతాడు.. క్లాస్​ బంక్​లు కొట్టిస్తాడు.. భవిష్యత్తుపై భరోసానూ కలిగిస్తాడు.. అవసరమైతే కాస్త కఠినంగానూ ఉంటాడు! ఈ రోజు స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఫ్రెండ్​షిప్​ బ్యాక్​డ్రాప్​లో వచ్చిన కొన్ని సినిమాలు ఇప్పుడు చూద్దాం!

ప్రేమదేశం

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఈ సినిమాలో ప్రేమకు ఎంత ప్రాధాన్యం ఇచ్చారో.. స్నేహానికి అంతే ప్రాముఖ్యత ఇచ్చారు. ఇద్దరు స్నేహితులు ఒకే అమ్మాయిని ప్రేమించినపుడు వారి మధ్య తలెత్తే సంఘర్షణలు, సంఘటనలు ఎలా ఉంటాయో ఈ చిత్రంలో చూపించారు. 90ల్లో వచ్చిన ఈ మూవీ కళాశాల స్నేహానికి అద్దం పట్టింది. కాలేజీ స్నేహం ఎప్పటికీ అంతం కానిది అంటూ చాటి చెప్పింది. ఇందులోని పాట ముస్తఫ్పా.. ముస్తఫ్పా.. డోంట్​ వర్రీ ముస్తఫ్ఫా అనే గీతం అప్పటికీ ఇప్పటికీ నిత్యనూతనమే.

నీ స్నేహం

ఈ సినిమా 2000లో విడుదలైంది. దర్శకుడు పరుచూరి మురళి. ఓ ఆటను ప్రాణం కన్న ఎక్కువగా ఇష్టపడే ఇద్దరు మిత్రుల కథ. ఓ మిత్రునికి యాక్సిడెంట్​లో కాలు పోతుంది. అతడి కోరిక తీర్చడానికి ఆ ఆటలో ఛాంపియన్​ అయ్యే దిశగా అడుగులు వేస్తాడు మరో మిత్రుడు. ఇదే సమయంలో వారికి ఓ అమ్మాయి పరిచయం అవుతుంది. తను వారి జీవితంలో ఎలాంటి మార్పును తీసుకుని వస్తుంది. ఆ తరువాత పరిణామాలు ఏంటి అనే కథాంశంగా ఈ చిత్రం తెరకెక్కింది. విడుదల అయిన రోజుల్లో ప్రేక్షాభిమానుల హృదయాలును ద్రవీంపచేసిందీ చిత్రం.

స్నేహం కోసం

పది మందిలో వీడు నా స్నేహితుడు అని గర్వంగా చెబితే.. అతడి కోసం ఏమైనా చేయాలనిపిస్తుంది. ఇదే కథాంశంతో మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం.. 'స్నేహం కోసం'. మిత్రుడి కుటుంబం బాగుండాలని తన జీవితాన్నే త్యాగం చేస్తాడు హీరో. ధనిక, పేద అనే తారతమ్యాలు లేకుండా మిత్రుడిని మిత్రుడిలా చూడాలి అనే పాఠాన్ని ఈ చిత్రంలో చూడవచ్చు. ఈ సినిమాలో చిరు నటనకు ప్రేక్షకులు దాసోహం అయిపోతారు. పతాక సన్నివేశంలో వచ్చే పాట చూసి కంటతడి పెట్టని వారుండరంటే అతిశయోక్తి కాదేమో! అంతగా ప్రేక్షకుల హృదయాలను ద్రవింపజేసేలా ఉంటుందీ సినిమా. మీసమున్న నేస్తమా.. నీకురోషమెక్కువా.. అని సాగే పాట ఆనాటి స్నేహగీతాల్లో టాప్​గా నిలిచింది. ఈ సినిమా దర్శకుడు కేఎస్​ రవికుమార్​ కాగా.. 1999లో రిలీజైంది.

హ్యాపీడేస్​

'పాదమెటుపోతున్నా.. పయనమెందాకైనా' అంటూ సాగే ఈ పాట వింటే చాలు స్నేహం విలువేంటో తెలుస్తుంది. ఈ పాటలోని 'మీరు మీరు నుంచి మన స్నేహగీతం ఏరాఏరాలోకి మారే..' అనే ఈ లిరిక్​కు చాలా మంది అభిమానులు ఉన్నారంటే స్నేహం గొప్పదనం ఎంతలా వివరించారో అనేది మనం గమనించవచ్చు. ఇందుకు తగ్గట్టుగా శేఖర్ కమ్ముల హ్యాపీడేస్ చిత్రాన్ని వాస్తవికానికి దగ్గరగా రూపొందించారు. దీంతో చిత్రం మరింత ఆదరణ పొందింది. మిత్రుని జీవితంలో ఉండే ఎత్తుపల్లాలను ఓ స్థాయిలో చూపించారు దర్శకుడు. ఇందులో ప్రేమ, ఆప్యాయతలను తన దైన శైలిలో రంగరించారు. ఈ సినిమా చూసే.. ఇంజినీరింగ్​ కోర్సు చదివిన వారున్నారంటే అతిశయోక్తి కాదు. అంతగా యువతపై ప్రభావం చూపిందీ చిత్రం.

ఎవడే సుబ్రహ్మణ్యం

ఈ సినిమాకు నాగ్​ అశ్విన్​ దర్శకుడు. విజయ్ దేవరకొండ, నాని కథానాయకులుగా ఈ చిత్రం తెరకెక్కింది. ఇందులో ఒక హీరో చనిపోతాడు. అతని చివరి కోరిక ఉంటుంది. ఆ కోరికను తన భుజాల మీదకెత్తుకుండు మరో స్నేహితుడు. ఈ క్రమంలోనే దూద్​ కాశీ అనే ప్రాంతానికి చేరుకోవాలని చూస్తారు. ఆ ప్రయాణంలో అతనికి ఎదురైన జీవితం నగ్నసత్యాలు ఏంటి? అతని ప్రయాణం ఎలా సాగింది? అనుభవాలు ఏంటి? చివరకు ఏమౌతుంది? అని ఆసక్తితో సాగుతుంది ఈ చిత్రం. కేవలం మిత్రుని కోరిక తీర్చడం కోసం మరో మిత్రుడు చేసే యజ్ఞంగా ఈ సినిమాను చెప్పవచ్చు.

శంభో శివ శంభో

మిత్రుడు ప్రేమిస్తున్నాడు అని తెలియగానే ముందుగా ఆనందపడే వారు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్లు స్నేహితులే. వారి కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఆఖరుకు ప్రాణాలు కూడా పణంగా పెడతారు. అలాంటి కథాంశంతో తెరకెక్కిందే ఈ సినిమా. సముద్రఖని ఈ చిత్రానికి దర్శకుడు. వసూళ్లపరంగా ఫర్వాలేదు అనిపించినా.. కంటెంట్​తో మాత్రం తనదైనా మార్క్​ను సంపాందించిందీ సినిమా.

ఓ మై ఫ్రెండ్

వేణు శ్రీరామ్​ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అబ్బాయి, అమ్మాయిల మధ్య ఉండే స్నేహానికి సంబంధించింది. చిన్ననాటి నుంచి వారి మధ్యన చిగురించిన స్నేహం.. పెళ్లి అయ్యాక ఎలా ఉంటుంది. ఆ మైత్రి బంధం జీవితాంతం కొనసాగుతుందా అనే కథాంశంతో తెరకెక్కింది. ప్రేమ, స్నేహం అనేవి రెండు వేరువేరు.. వాటికి నిజమైన అర్థం చూపించిన సినిమాగా దీన్ని చెప్పవచ్చు. ఇందులో శ్రుతీహాసన్​, హన్సిక, సిద్ధార్థ్​, నవదీప్​లు ప్రధాన పాత్రల్లో నటించారు.

స్నేహితుడు

ఈ సినిమాకు శంకర్​ దర్శకత్వం వహించారు. దీనికి మూలం హిందీలోని అమీర్​ఖాన్​ నటించిన 'త్రీ ఈడియట్స్​'. ఇష్టమైన రంగంవైపు అడుగులు వేస్తే జీవితంలో సమున్నత శిఖరాలు అధిరోహించగలం అంటూ.. స్నేహితులను సరైన మార్గం వైపు నడిపే మిత్రుని పాత్రలో తమిళ హీరో విజయ్​ ఈ చిత్రంలో కనిపించారు. బట్టీ పట్టే చదువులుకు స్వస్తి చెప్పి ప్రాక్టికాలిటీ వైపు విద్యావ్యవస్థ అడుగులు వేస్తే బాగుంటుంది అనే కథాంశంతో తెరకెక్కింది. ఇందులో స్నేహానికి పంచబట్ల సారంగపాణీ అనే పాత్ర ఇచ్చిన విలువ సినిమాకు హైలెట్​ అనే చెప్పాలి.

ఉన్నది ఒకటే జిందగీ

"ట్రెండు మారినా ఫ్రెండు మారడు" అంటూ స్నేహానికి సరికొత్త భాష్యం చెప్పిన చిత్రం 'ఉన్నది ఒకటే జిందగీ'. స్నేహితుడు ఎందుకు ముఖ్యమో ఈ సినిమా చాటి చెప్పింది. ఆమోదయోగ్యమైన సంభాషణలతో, ఆకట్టుకునే పాటలతో స్నేహాన్ని, ప్రేమను బ్యాలెన్స్​గా తెరకెక్కించాడు దర్శకుడు. "మన కథలు చెబితే వినేవాడు ఫ్రెండ్​.. కానీ ప్రతి కథలో ఉండేవాడు బెస్ట్​ ఫ్రెండ్​" లాంటి డైలాగ్​ల​తో సినీ ప్రియుల్ని అలరించిందీ చిత్రం. రామ్​ పోతినేని, లావణ్యా త్రిపాఠీ, అనుపమ పరమేశ్వరన్​, శ్రీవిష్ణులు ప్రధానపాత్రల్లో నటించి అలరించారు.

మహర్షి

టాలీవుడ్​ను ఉర్రూతలూపిన ఈ సినిమాలో ఓ స్నేహితుడి కోసం ప్రపంచస్థాయి సంస్థకు సీఈఓగా వ్యవహరిస్తున్న ఓ వ్యక్తి ఏం చేశాడు? ఎందుకు చేశాడు? దానికి గల కారణాలు ఏంటి? అనే కథాంశంగా ఈ చిత్రం తెరకెక్కింది. రిషి కుమార్​ పాత్రలో సూపర్​ స్టార్​ మహేశ్​ బాబు మెప్పించగా.. ఫ్రెండ్​ పాత్రలో అల్లరి నరేష్​ అలరించారు. ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు.

కథానాయకుడు..

రజనీకాంత్, జగపతిబాబు నటించిన 'కథానాయకుడు' చిత్రం స్నేహంపై వచ్చిన ఉత్తమ సినిమాల్లో ఒకటి. మీకో మంచి స్నేహితుడు కావాలంటే బాల్యంలోనే ఎంచుకోవాలని చెబుతూ స్నేహం గొప్పతనాన్ని చాటి చెప్పిందీ సినిమా. క్లైమాక్స్​లో రజనీ, జగపతిబాబు నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

ఇద్దరు..

ప్రముఖ రాజకీయనాయకుల జీవితాల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం స్నేహంలో వైరం ఎలా ఉంటుందో చూపించింది. స్వతహాగా ఇద్దరూ ప్రాణ స్నేహితులు.. వారి సిద్ధాంతాలు వారిని వేరు వేరుగా ఉండేలా చేస్తాయి. మనసులో ఆప్తులమనే భావన ఉంటూనే.. బయటకు మాత్రం రాజకీయ చతురతలు, వ్యూహాలు ప్రదర్శిస్తారు. వ్యక్తిగతంగా స్నేహితులు గాను.. రాజకీయంగా శత్రువుల్లా ఉంటారు. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ప్రకాశ్ రాజ్, మోహన్​లాల్ తమ నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.

ఇంకా మరెన్నో సినిమాలు స్నేహం విలువను చాటిచెప్పాయి. ఏది ఏమైనా స్నేహితుడు.. కష్టాల్లో తోడుంటాడు.. సంతోషాన్ని పంచుకుంటాడు.. స్వార్థం లేని ఏకైక బంధువు.. ఇవన్నీ కాసేపు పక్కన పెట్టి మిత్రుడు అనే పదాన్ని ఒక్క ముక్కలో చెప్పాలంటే మన బంధం కాదు.. కానీ ఎప్పుడూ మనతోనే ఉండే అనుబంధం.

ఇదీ చూడండి: మన ఫ్రెండల్లే ఇంకెవరుంటారూ...!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.