ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ పూరీ నటిస్తున్న మూడో చిత్రం 'రొమాంటిక్'. ఈ సినిమా సెట్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సెట్‌లో ఏర్పాటు చేసిన తెరకు నిప్పు అంటుకుంది. సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటల్ని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ ఎత్తులో ఉన్న తెరలకు కూడా నిప్పు వ్యాపించింది. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాద సమయంలో తీసిన వీడియో బయటికి వచ్చింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
'మెహబూబా' తర్వాత ఆకాశ్ పూర్తిస్థాయి కథానాయకుడిగా 'రొమాంటిక్' అనే చిత్రంలో నటిస్తున్నాడు. అనిల్ పాడూరి దర్శకుడు. కేతికా శర్మ కథానాయిక. పూరీ కనెక్ట్స్ పతాకంపై పూరీ జగన్నాథ్, ఛార్మి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవలే ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం. 'ధోని', 'ఆనందం', 'బిజినెస్‌మేన్', 'బుజ్జిగాడు' తదితర సినిమాల్లో ఆకాశ్ బాలనటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.