'ప్రేమ.. రెండక్షరాల మహా కావ్యం. ప్రతి మనిషి అన్వేషణ ప్రేమ కోసమే. ఈ ప్రపంచం ఇంత అందంగా ఉందంటే అది కేవలం ప్రేమ వల్లే'.. ఇదీ ప్రేమలో ఉన్న వారికి కలిగే భావన. గతించిన చరిత్రలో, ప్రస్తుత వర్తమానంలో ఎంతోమంది గొప్ప ప్రేమికుల గురించి మనం వినే ఉంటాం. ఇక ఫిబ్రవరి 14 వచ్చిందంటే చాలు.. ప్రేమికులు తమ మనసులోని భావాలను వ్యక్తం చేయడానికి తహతహలాడుతుంటారు.
అప్పటికే ప్రేమ మైకంలో తేలియాడుతున్న వారు ఈ ప్రత్యేకమైన రోజున తమ ప్రియమైన వారిని ఎలా ఇంప్రెస్ చెయ్యాలని ఆలోచిస్తే.. మొదటిసారి ప్రేమను వ్యక్తపరచాలనుకునే వారికి వాలంటైన్స్ డే ఓ మధురానుభూతిగా మిగిలిపోతుందని చెప్పుకోవచ్చు.
ఇలా నిజ జీవితంలోనే కాదు.. వెండితెరపైనా ఎన్నో ప్రేమ కావ్యాలు సినీ ప్రియుల మనసును తాకాయి. అందులోని పాటలే కాదు.. డైలాగ్స్ కూడా ఈతరం ప్రేమికులు తమ ప్రియమైన వారితో చెబుతూ తమ మనసులోని ప్రేమను పంచుకోవడం మనం చూస్తూనే ఉంటాం.. ఈక్రమంలో ప్రేమికుల దినోత్సవం సందర్భంగా తెలుగు చిత్రాల్లోని కొన్ని పాపులర్ లవ్ డైలాగ్స్ మీకోసం.
జాను
పది నెలలు మోసి కన్న మీ అమ్మకు నువ్వు సొంతమైతే.. ఇన్నాళ్లుగా మనసులో మోస్తున్న నాకు కూడా నువ్వు సొంతమే.
అర్జున్‌రెడ్డి
మనకేమైనా ఎఫెక్ట్ అయితే.. మనం పోతే.. ది మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒక్కరుంటారు. అది నా లైఫ్‌లో ఆ పిల్లే. ఆ పిల్లకి ఏమన్నా అయితే ఐ విల్ బి మోస్ట్ ఎఫెక్టెడ్
మజిలీ
పెళ్లికి ముందులాగా.. పెళ్లి తర్వాత ప్రేమ కంటికి కనబడదు. అది ఒకరి మీద ఒకరికి ఉండే హక్కులోనే ఉంటుంది. ఒకరికోసం ఇంకొకరు తీసుకునే బాధ్యతలోనే ఉంటుంది.
ఆర్య
నీకోసమే నా అన్వేషణ.. నీ కోసమే నా నిరీక్షణ. నిన్ను చూసే క్షణం కోసం.. కొన్ని వేలసార్లు మరణించైనా సరే.. ఒక్కసారి జన్మించడానికి సిద్ధంగా ఉన్నాను.
నిన్ను కోరి
నువ్వు ఇచ్చిన ధైర్యమే ఇంత బాగుంటే... లైఫ్ అంతా నువ్వు నాతో ఉంటే ఇంకెంత బాగుంటుంది?
ఏమాయ చేశావె
ఈ ప్రపంచంలో ఉన్న అమ్మాయిలంతా ఇప్పటి నుంచి నా సిస్టర్సే... ఒక్క నువ్వు తప్ప.
వాన
ఈ ప్రపంచంలో నేను ప్రేమించినంతగా నిన్ను ఎవ్వరూ ప్రేమించలేరు. నువ్వు ఎక్కడున్నా.. ఎలా ఉన్నా.. నన్ను మర్చిపోయినా.. ముసలిదానివైపోయినా.. చచ్చిపోయినా నీ మీద నా ప్రేమ చావదు.
మళ్లీ మళ్లీ ఇది రాని రోజు
కళ్లు కూడా మాట్లాడగలవని నాకు తెలియదు.. నీ కళ్లు నాతో మాట్లాడేదాకా!
ప్రాణం లేకపోయినా బతకొచ్చని నాకు తెలియదు.. అది నువ్వు తీసుకెళ్లిపోయేదాకా!
మన్మథుడు
నువ్వంటే ఎందుకు ఇష్టమో చెప్పలేను.. కానీ ఎంతిష్టమో చెప్పగలను!
ప్రేయసిరావే
ప్రవహిస్తున్న ప్రతి రక్తపు బిందువు మీద నీ పేరే ఉంటుంది. పీలుస్తున్న ప్రతి గాలి రేణువులోనూ నీ రూపమే ఉంటుంది. కదులుతున్న ప్రతి జీవ కణంలోనూ నీ జ్ఞాపకమే ఉంటుంది.
తీన్‌మార్
మనకు జ్వరమొచ్చినప్పుడు అమ్మ కావాలనిపిస్తుంది. భయమేసినప్పుడు నాన్న ఉంటే ధైర్యంగా ఉంటుంది. బాధలో ఉన్నప్పుడు పక్కన ఫ్రెండ్ ఉంటే బాగుంటుంది. ఆనందంగా ఉన్నప్పుడు మన పక్కన ప్రేమించిన వాళ్లుంటే బాగుంటుంది.
ఆరెంజ్
ప్రేమ ఆరంభంలోనే అద్భుతంగా ఉందంటే.. ముగింపు ఇంకా అద్భుతంగా ఉండాలి. అలాంటి సముద్రమంత ప్రేమను చూడాలంటే.. జీవితపు చివరి అంచుల్లోనే చూడగలవు. అలా చూడాలంటే ఒక్కమ్మాయినే ప్రేమించాలి.
ఊపిరి
ప్రేమ ఉన్న చోటే భయం ఉంటుంది. ప్రేమిస్తున్నామని చెబితే.. ఎక్కడ రిజెక్ట్ చేస్తారోనని భయం. దగ్గరయ్యాక ఎక్కడ కోల్పోతామోనని భయం. మనకి కావాల్సిన వాళ్లు దూరమైతే.. ఎలా ఉన్నారని భయం. నిజానికి భయం ఉంటే.. ప్రేమ ఉన్నట్టే..!
పడిపడిలేచె మనసు
మిమ్మల్ని ప్రేమించిన వాళ్లకి.. అది కష్టమైనా, నష్టమైనా చివరి వరకూ మీతోనే ఉండాలనిపిస్తుంది.
అందాల రాక్షసి
నా ప్రేమను చాపలా పరిస్తే ఈ భూమి సరిపోదు. గాలిలో నింపితే ఈ విశ్వం బద్దలవుతుంది. నీళ్లలో కలిపితే సముద్రాలు ఇంకిపోతాయి. శివుడు విషాన్ని దాచినట్టుగా దాయగలను.
హలో గురు ప్రేమకోసమే
గుర్తుంచుకోవాలి.. గుర్తుంచుకోవాలి అని చదివే చదువు మాత్రం మర్చిపోతాం. కానీ మర్చిపోవాలి... మర్చిపోవాలి అనుకున్న అమ్మాయిని మాత్రం చచ్చేదాకా మర్చిపోలేం.
కంచె
గులాబీ పువ్వును ఇష్టపడితే కోస్తాం.. ప్రేమిస్తే నీళ్లు పోస్తాం.
ఓయ్
నేను పడుకోబోయే ముందు చివరి ఆలోచన, లేచాక మొదటి ఆలోచన నువ్వే.
మనం
మనుషుల్ని సృష్టించిన ఆ దేవుడే ప్రేమను, మనసును సృష్టించాడు. మనిషి ప్రాణానికి పరిమితి పెట్టగలిగిన ఆ దేవుడు.. మనసుకు, ప్రేమకు ఎందుకు ఆ పరిమితులు పెట్టలేకపోయాడు?!
ఒక లైలా కోసం
ప్రాణం అంటూ పోవాల్సి వస్తే అది నీతోనే. లేకపోతే నా ప్రేమకు అర్థమే లేదు.