ETV Bharat / sitara

'ఎఫ్ 3' సందడి మొదలైంది.. నవ్వుకోవడానికి సిద్ధమా! - 'ఎఫ్ 3' ఫస్ట్​లుక్

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్​ ప్రధాన పాత్రల్లో అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం 'ఎఫ్ 2'. గతేడాది సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో 'ఎఫ్ 3'ని త్వరలోనే పట్టాలెక్కించనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది చిత్రబృందం. తాజాగా నేడు (ఆదివారం) వెంకీ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేసింది.

F3 first glimpse released
'ఎఫ్ 3' సందడి మొదలైంది.. నవ్వుకోవడానికి సిద్ధమా!
author img

By

Published : Dec 13, 2020, 11:48 AM IST

గతేడాది సంక్రాంతి బరిలో నిలిచి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది 'ఎఫ్‌ 2'. ఈ చిత్రాన్ని వెంకటేష్, వరుణ్‌ తేజ్‌లతో దర్శకుడు అనిల్‌ రావిపూడి తెరకెక్కించాడు. కామెడీ ప్రధానంగా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తింది. ఈ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అక్కడితో ఆపకుండా ఇంకా వినోదం పంచాలనుకుంటున్నాడు దర్శకుడు అనిల్‌. ఇందుకు సీక్వెల్‌గా 'ఎఫ్‌ 3'ని తెరకెక్కిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించాడు.

తాజాగా ఈరోజు (ఆదివారం) వెంకీ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్​లుక్​తో పాటు ఓ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. "సమస్య డబ్బులు అయినప్పుడు మరి ఫన్ పీక్స్​లోనే ఉంటుందిగా.. అంతేగా అంతేగా" అంటూ క్యాప్షన్ ఇస్తూ ట్వీట్ చేశాడు అనిల్ రావిపూడి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'ఫన్, ఫ్రస్టేషన్, మోర్ ఫన్​' అనే క్యాప్షన్​తో ఈ చిత్రం తెరకెక్కనుంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభమవనుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.