ETV Bharat / sitara

కొన్నిసార్లు నష్టపోయా, భయపడ్డాను: ప్రియాంక చోప్రా

తన జీవిత కథతో ఇటీవలే ఓ పుస్తకాన్ని విడుదల చేసిన ప్రియాంక చోప్రా.. ఇన్​స్టా​ వేదికగా పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. తన జీవితంలోని అనుభవాలను వెల్లడించింది.

Priyanka
ప్రియాంక చోప్రా
author img

By

Published : Oct 4, 2020, 7:45 AM IST

బాలీవుడ్​ బ్యూటి ప్రియాంక చోప్రా తన జీవిత కథను 'అన్​ఫినిష్డ్'​ పేరుతో ఇటీవలే ఓ పుస్తకాన్ని విడుదల చేసింది. ఇందులో ఆమె బాల్య జ్ఞాపకాలు, నటిగా మరడానికి ముందు తన జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లు, అందుకున్న విజయాలు.. ఇలా అనేక విషయాలను పంచుకుంది. ఇప్పటికే అమెరికాలో విడుదలైన ఈ పుస్తకం.. అత్యధికంగా అమ్ముడైన పుస్తకాల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు శుక్రవారం నుంచి భారత్‌లోనూ అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తన పుస్తక కవర్‌ పేజీని ఇన్‌స్టాలో పోస్ట్​ చేస్తూ.. కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది ప్రియాంక.

Priyanka
ప్రియాంక చోప్రా

"నమ్మకంతో ధైర్యంగా ఎలా జీవించాలో చిన్నప్పటి నుంచే నా తల్లిదండ్రులు నాకు నేర్పించారు. ఈ విషయంలో నేనెప్పుడూ సందిగ్ధంగా లేను. విశ్వాసంతో నాకు నేను మార్గనిర్దేశం చేసుకుంటూ ఎన్నో సవాళ్లను ఉత్సాహంగా ఎదుర్కొంటూ ముందుకు నడిచా. ఈ ప్రయాణంలో నేను అనుకున్న గమ్యాలకు చేరుకుంటూ వచ్చా. కొన్నిసార్లు నష్టపోయా. భయపడ్డా. కొన్ని సాధించలేకపోయా. కానీ, ఈ ప్రక్రియలో నేను నేర్చుకున్నది ఏంటంటే.. నేనెప్పుడూ మార్పు నుంచి దూరంగా ఉండలేదు. దేన్నీ అసంపూర్ణంగా వదిలేశానన్న అపరాధ భావన లేదు. నా జీవితంలో మీకు తెలియని ఇలాంటి ఎన్నో విషయాల్ని దీని ద్వారా మీరు కచ్చితంగా నేర్చుకుంటారు". అని తన వరుస పోస్ట్‌లలో రాసుకొచ్చింది ప్రియాంక.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.