'ఏక్ మినీ కథ'(Ek Mini Katha) చిత్రం కేవలం ఓ వ్యక్తి గురించి చెప్పిన కథ కాదని ఆ చిత్ర హీరో సంతోష్ శోభన్ అన్నారు. సమాజంలో ఉన్న ప్రతిఒక్కరికి కోసం ఈ సందేశాత్మక చిత్రాన్ని రూపొందించినట్లు తెలిపారు. అమెజాన్ ప్రైమ్(ek mini katha on prime) వేదికగా గురువారం(మే 27) విడుదలైన ఈ సినిమా విశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంటోంది. ఈ సందర్భంగా హీరో సంతోష్ శోభన్ మీడియాతో మాట్లాడారు.
"సినిమాలో హీరోకు ఉన్న సమస్య గురించి నేను ముందుగానే చదివి.. స్వీయ పరిశోధన చేశాను. తన పురుషాంగం చిన్నదని భావించే ఓ వ్యక్తి కథ ఇది. కానీ, ఇది కేవలం వ్యక్తి గురించే కాదు. సమాజంలో ఇలాంటి వారి కోసమే రూపొందించిన చిత్రం. అలాంటి ఆలోచనలతో ఉన్న వారికి ఈ సినిమా ఓ సందేశాన్ని ఇస్తుంది. డైరెక్టర్ కార్తీక్, కథారచయిత మేర్లపాక గాంధీ మాకు చాలా మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా వారిద్దరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను".
- సంతోష్ శోభన్, కథానాయకుడు
'పేపర్‌బాయ్' చిత్రంతో హీరోగా పరిచయమైన సంతోష్ శోభన్ హీరోగా నటించిన రెండో చిత్రమిది. నూతన దర్శకుడు కార్తీక్ రాపోలు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. కావ్య థాపర్ హీరోయిన్. శ్రద్ధాదాస్, బ్రహ్మాజీ, సప్తగిరి, సుదర్శన్, పోసాని కృష్ణమురళి(ek mini katha cast) కీలకపాత్రలు పోషించారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించారు.
ఇదీ చూడండి: (ek mini katha review) 'ఏక్ మినీ కథ' ఎలా ఉందంటే?