ETV Bharat / sitara

సల్మాన్ 'రాధే' విడుదల తేదీ వచ్చేసింది - సల్మాన్ రాధే విడుదల తేదీ వచ్చేసింది

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'రాధే' విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రాన్ని ఈద్ కానుకగా మే 13న విడుదల చేయబోతున్నట్లు తెలిపింది చిత్రబృందం.

Salman announces Radhe release date
సల్మాన్ రాధే విడుదల తేదీ వచ్చేసింది
author img

By

Published : Mar 13, 2021, 2:00 PM IST

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్​ఖాన్ నటించిన​ 'రాధే' విడుదల ఖరారైంది. గతేడాది రిలీజ్ కావాల్సిన ఈ మూవీ కరోనా కారణంగా వాయిదాపడింది. ఆ తర్వాత విడుదల తేదీపై సందిగ్ధత నెలకొంది. తాజాగా అభిమానుల ఎదురుచూపులకు బ్రేక్ వేస్తూ మే 13న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు వెల్లడించింది చిత్రబృందం.

ఈ చిత్రంలో సల్మాన్ సరసన దిశా పటానీ నటిస్తుండగా.. జాకీ ష్రాఫ్​, జరీనా వాహబ్, రణదీప్​ హుడా కీలకపాత్రలు పోషిస్తున్నారు. ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ దర్శకుడితో ఇంతకు ముందు 'వాంటెడ్', 'రెడీ', 'దబంగ్ 3' సినిమాల్లో నటించారు సల్మాన్.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.