అగ్రకథానాయకుడు నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా(balakrishna new movie) షూటింగ్ త్వరలో మొదలుకానుంది. ఇందులో భాగంగానే నటీనటులు ఎంపిక జరుగుతోంది. హీరోయిన్గా శ్రుతిహాసన్‌ను(shruti hassan first movie) ఇటీవల ప్రకటించారు. ఇప్పుడు ప్రతినాయకుడి పాత్ర కోసం కన్నడ ప్రముఖ నటుడిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
రౌడీ రోల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న విజయ్(duniya vijay movies).. 'దునియా' సినిమాతో హీరోగా మారారు. ఆ తర్వాత ఆ చిత్ర టైటిల్‌నే తన ఇంటి పేరుగా మార్చుకుని అభిమానుల్ని సంపాదించారు.
![duniya vijay](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13568281_vijay.jpg)
ఇటీవల కాలంలో పాన్ ఇండియా సినిమాలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో దునియా విజయ్ను తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయంలో బాలయ్య(balayya movies) చిత్రబృందం ఉన్నట్లు తెలుస్తోంది. మరి నిజమెంత అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.
![shruthi hassan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13568281_shruthi.jpg)
ఇవీ చదవండి: