ETV Bharat / sitara

'అడ్వాన్స్​ హ్యాపీ మ్యారేజ్​ లైఫ్​ సాయి తేజ్​' - సాయిధరమ్​ తేజ్​ కొత్త సినిమా అప్​డేట్​

టాలీవుడ్​ యంగ్​ హీరోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నారు. సాయిధరమ్​ తేజ్​ పెట్టిన ఒక్క ట్వీట్​తో మిగిలిన హీరోలంతా స్పందించారు. ఈ సంభాషణ అంతా పెళ్లి చుట్టే తిరుగుతోంది. అయితే కొంతమంది నెటిజన్లు సాయి తేజ్​ కొత్త సినిమా 'సోలో బ్రతుకే సో బెటర్​'లోని ఓ సాంగ్​ విడుదల కోసమే ఇదంతా అని అంటున్నారు.

Director Venky Kudumula Tweet About No Pelli Song
'అడ్వాన్స్​ హ్యాపీ మ్యారేజ్​ లైఫ్​ సాయిధరమ్​ తేజ్​'
author img

By

Published : May 24, 2020, 2:48 PM IST

సాయిధరమ్‌ తేజ్‌ పెట్టిన ఓ ట్వీట్‌తో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు యువ నటులు ఒక్కసారిగా నెట్టింట్లో సందడి చేశారు. హీరోల సరదా ట్వీట్స్‌తో సినీ ప్రియులు సంతోషం వ్యక్తం చేశారు. అసలేం జరిగిందంటే.. వరుణ్‌ తేజ్‌ను ట్యాగ్‌ చేస్తూ.. "ఏంటి బావా.. నీకు పెళ్లంటా?" అని శనివారం సాయిధరమ్‌ తేజ్‌ ట్వీట్‌ చేశారు.

సాయి తేజ్‌ ట్వీట్‌పై స్పందించిన వరుణ్‌ తేజ్‌ .. "దానికి చాలా టైమ్‌ ఉందిలే కానీ, మన రానా, నితిన్‌ మాత్రం ఎప్పటికీ మీతోనే ఉంటాం రా అని చెప్పి సింపుల్‌గా సింగిల్‌ గ్రూప్‌ నుంచి ఎగ్జిట్‌ అయిపోయారు." అని సమాధానం ఇచ్చారు. దీనిపై స్పందించిన నితిన్‌.. "బాధపడకండి బ్రో.. మీకూ సమయం వస్తుంది. అవన్నీ కాదు కానీ అప్పుడెప్పుడో నా పుట్టినరోజుకి గిఫ్ట్‌ ఇస్తానన్నావ్‌ కదా సాయి, మరి నా గిఫ్ట్‌ ఎక్కడ? ఎప్పుడు ఇస్తావ్‌? నేను ఎదురుచూస్తున్నా" అని రిప్లై ఇచ్చారు.

Director Venky Kudumula Tweet About No Pelli Song
సాయిధరమ్​ తేజ్​ ట్వీట్​

కాగా, నితిన్‌ ట్వీట్‌కు స్పందిస్తూ.. "నేను ఎప్పుడో నీ గిఫ్ట్‌ పంపేశా. సోమవారం నీ దగ్గరికి వస్తుంది. మా సింగిల్స్‌ తరఫున మీ మింగిల్స్‌ అందరికీ ఈ పాట అంకితం" అని 'సోలో బ్రతుకే సో బెటర్‌' చిత్రంలోని 'నో పెళ్లి' అనే పాట విడుదల గురించి సాయితేజ్‌ తెలియజేశారు. ఇదిలా ఉండగా సాయితేజ్‌ పెట్టిన ట్వీట్‌కు దర్శకుడు వెంకీ కుడుముల రిప్లై ఇచ్చారు. 'సింగిల్‌ యాంథమ్‌' అన్న కొన్నిరోజులకే నితిన్‌ ఎంగేజ్డ్‌ అన్నారు. మీరూ ఇప్పుడు 'నో పెళ్లి' అంటున్నారంటే తర్వాత ఏం జరగనుందో నేను పసిగట్టగలను. అడ్వాన్స్‌గా 'హ్యాపీ మ్యారేజ్‌ లైఫ్‌ సాయితేజ్‌ బ్రో" అని కామెంట్ పెట్టారు.

'నో పెళ్లి' సాంగ్​ పోస్టర్​​

దీనిపై నితిన్‌ స్పందిస్తూ.. 'నిజమే.. నిజమే' అని సరదాగా వ్యాఖ్యానించారు. అయితే ఈ చాటింగ్‌ ఇంతటితో ఆగలేదు. హాస్యనటుడు వెన్నెల కిషోర్‌, దర్శకుడు మారుతి, మంచుమనోజ్‌, మంచులక్ష్మి కూడా ఇందులో భాగమయ్యారు. ఇలా హీరోలు, డైరెక్టర్లు సరదాగా ట్వీట్లు చేసుకోవడం చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి... 'ప్రియాంక అనుకున్నది ఒకటి.. అయినది ఒకటి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.