ETV Bharat / sitara

మాటే మంత్రం.. ఈ త్రివిక్రముడి తంత్రం

చిత్రపరిశ్రమలో రచయితలకు మరింత గౌరవం తీసుకొచ్చిన దర్శకుడు త్రివిక్రమ్‌. మాటలతో మాయ చేస్తూ.. భాషలో సొగసుల్ని చూపిస్తూ.. ప్రేక్షకులకు స్వచ్ఛమైన వినోదం పంచుతుంటారు. రచయితగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఆయన దర్శకుడిగానూ సత్తా చాటుతున్నారు. నేడు (నవంబరు 7) మాటల మాంత్రికుడు త్రివిక్రమ్​ పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని విశేషాలను తెలుసుకుందాం.

Director Trivikram best dailogues about life
మటే మంత్రం.. ఈ త్రివిక్రముడి తంత్రం
author img

By

Published : Nov 7, 2020, 5:24 AM IST

'అతడు'.. తన మాటలతో ప్రేక్షకుల్ని మాయ చేసే మాటల మాంత్రికుడు. ప్రాసల 'ఖలేజా'తో ప్రేక్షకులను ఆకట్టుకునే మాటల రచయిత, దర్శకుడు. ఆయన మాటలకు అబ్బురపడిన ప్రేక్షకులు 'నువ్వు నాకు నచ్చావ్‌' అన్నారు. 'జై చిరంజీవా' అంటూ ఆశీర్వదించారు. ఆ మధ్య 'అరవింద సమేత'తో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇటీవలే 'అల వైకుంఠపురములో' సినిమాతో అలరించిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ పుట్టినరోజు నేడు (నవంబరు 7). ఈ సందర్భంగా ఆయన​ సినిమాల్లోని ఫేమస్​ డైలాగ్​లు మీకోసం.

Director Trivikram best dailogues about life
త్రివిక్రమ్​ శ్రీనివాస్​
  • మనం గెలిచినప్పుడు చప్పుట్లు కొట్టే వాళ్లు, మనం ఓడిపోయినప్పుడు భుజం తట్టే వాళ్లు నలుగురు లేనప్పుడు.. ఎంత సంపాదించినా, ఎంత పోగొట్టుకున్నా తేడా ఏముండదు - వెంకటేశ్
  • వయసు అయిపోయిన హీరోలందరూ రాజకీయ నాయకులు అయినట్టు.. ఫెయిల్​ అయిన ప్రేమికులు అందరూ ఫ్రెండ్స్​ అయిపోలేరు -వేణు
  • మనం తప్పు చేస్తున్నామో రైట్​ చేస్తున్నామో మనకు తెలుస్తుంది.. మనకు మాత్రమే తెలుస్తుంది -తరుణ్
  • నిజం చెప్పకపోవడం అబద్ధం. అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం -మహేశ్ ​బాబు
  • మనం ఇష్టంగా అనుకున్నదే అదృష్టం.. బలంగా కోరుకునేది భవిష్యత్తు -అల్లు అర్జున్​
  • మనుషులు పుట్టాకే సంప్రదాయాలు పుట్టాయి. సంప్రదాయాలు పుట్టాక మనుషులు పుట్టలేదు -సుహాసిని

  • ఆడపిల్లకు గుణాన్ని మించిన ఆస్తి లేదు - విక్టరీ వెంకటేశ్
  • ఒక మనిషిని ప్రేమిస్తే, వాళ్లు చేసే తప్పుని కూడా మనం క్షమించగలగాలి - తరుణ్
  • అద్భుతం జరిగేటపుడు ఎవరూ గుర్తించరు. జరిగిన తర్వాత ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు - రావు రమేశ్
  • ఆడపిల్లలు.. ఎంత తొందరగా ప్రేమిస్తారో అంత తేలిగ్గా మర్చిపోతారు - మన్మథుడు
  • దెయ్యం కంటే భయం మహా చెడ్డదండి - సునీల్​
  • తండ్రికి, భవిష్యత్తుకు భయపడని వాడు.. జీవితంలో పైకి రాలేడు -విజయ్ కుమార్​
  • విడిపోయేటపుడే బంధం విలువ.. తెగిపోయేటపుడే దారం విలువ తెలుస్తుంది - రావు రమేశ్
  • బెదిరింపునకు భాష అవసరం లేదు.. అర్థమైపోతుంది -ముఖేశ్ రిషి
  • పనిచేసి జీతం అడగొచ్చు. అప్పిచ్చి వడ్డీ అడగొచ్చు. కాని హెల్ప్ చేసి మాత్రం థ్యాంక్స్​ అడక్కూడదు -వెంకటేశ్​

    పవన్​ కల్యాణ్​తో త్రివిక్రమ్​ శ్రీనివాస్​
  • బాధలో ఉన్నవాడిని ఎలా ఉన్నావు అని అడగడం అమాయకత్వం. బాగున్నవాడిని ఎలా ఉన్నావు అని అడగడం అనవసరం - చంద్రమోహన్
  • కారణం లేని కోపం, ఇష్టం లేని గౌరవం, బాధ్యత లేని యవ్వనం, జ్ఞాపకం లేని వృద్ధాప్యం అనవసరం - పవర్​స్టార్ పవన్​కల్యాణ్
  • ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు - అత్తారింటికి దారేది
  • మనసులో ఉన్న మనిషి పక్కన మామూలుగా తిరగడం చాలా కష్టం -వర్ష
  • సంపాదించడం చేతకాని వాడికి ఖర్చు పెట్టే అర్హత లేదు - చంద్రమోహన్
  • దేన్నైనా పుట్టించే శక్తి ఇద్దరికే ఉంది. ఒకటి నేలకు.. రెండు వాళ్లకి.. అలాంటోళ్లతో మనకు గొడవేంటి.. జస్ట్ సరెండర్ అయిపోవాలంతే.- అల వైకుంఠపురములో
  • గొప్ప యుద్ధాలన్నీ.. నా అనుకునే వాళ్లతోనే.- అల వైకుంఠపురములో
  • వంటోడికి.. వెయిటర్​కి నో చెప్పడం ఈజీ.. కానీ పవర్ ఉన్నోడికి నో చెప్పడం కష్టం. ఎంత పెద్దోడికి నో చెబితే అంత గొప్పోడివి అవుతావ్- అల వైకుంఠపురములో
  • అబద్దం చెబితే ప్రేమ తెలుస్తుంది. కానీ నిజం చెబితేనే కదా.. ప్రేమ ఎంత గొప్పదో తెలుస్తుంది. కష్టం అయినా నిజం మీద నిలబడే బంధం రాక్ సాలిడ్ గా వుంటుంది.- అల వైకుంఠపురములో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.