"సంబరాలు జరుపుకోవాల్సిన సమయంలో మేము కన్నీళ్లు కార్చామనేది వాస్తవం. గొప్ప సినిమాకు దర్శకుడిగా ఆస్కార్ లభించిన సందర్భంలో నిర్మాత పార్టీ ఇస్తే, నేనూ, నిర్మాత ఇద్దరమూ బాధతో, ఆవేదనతో విలవిలలాడాము. అలాంటి చిత్రం తీయడం గొప్పే కానీ, అసలు అలాంటి సినిమా తీయాల్సి రావడమే మా జీవితాలలో దురదృష్టం" అంటూ ఆవేదనతో తన బాధను వ్యక్తం చేశారు స్టీవెన్ స్పీల్‌బెర్గ్. ఆయన ఆ మాటలను 'షిండ్లర్స్ లిస్ట్' సినిమా 25వ వార్షికోత్సవం వేడుకల సమయంలో అనడాన్ని, మౌనంగా విన్నారు ఆ చిత్రం నటీనటబృందం సభ్యులైన లియామ్ నీసన్, బెన్ కింగ్‌స్లే, కారొలిన్ గుడాల్, ఎంబెత్ డేవిడ్జ్‌లు.
"నేను అదే సమయంలో 'జురాసిక్ పార్క్' చిత్రం షూటింగ్‌లో నిమగ్నమయి ఉన్నా. అప్పుడే, 'షిండ్లర్స్ లిస్ట్' రచయిత స్టీవెన్ జైలియాన్, ఒక అద్భుతమైన స్క్రిప్ట్‌ను నాముందుంచారు. అది చదివిన నేను కదిలిపోయాను. కన్నీటి వరదల్లో మునిగిపోయా. నా భార్య ఆ స్క్రిప్ట్ చదివి, 'ఈ సినిమాను ఇప్పుడే తీయాలి, వాయిదా వేయొద్దు' అంది. ఒక వైపు 'జురాసిక్ పార్క్' షూటింగ్‌లో రాక్షస బల్లుల బొమ్మలతో పనిచేస్తూ, మరోవంక 'షిండ్లర్స్ లిస్ట్' చిత్రం కోసం రాక్షసులవంటి మనుషుల పాత్రలతో పనిచేయటం.. నా జీవితంలోని దౌర్భాగ్య క్షణాలు."
-స్పీల్‌బెర్గ్, ప్రముఖ దర్శకుడు
''షిండ్లర్స్ లిస్ట్' చిత్రానికి 1994లో 7 ఆస్కార్‌లు వచ్చిన సందర్భంగా నిర్మాత బ్రాంకో లుస్టిగ్ మాకు పార్టీ ఇచ్చినా, ఆ పార్టీ సమయంలో ఆయన స్వయంగా హిట్లర్ కాన్‌సన్‌ట్రేషన్ క్యాంప్‌లో పడిన అవస్థలు చెప్తోంటే, పార్టీలో మేము ఆనందంలో కాదు, కన్నీటిలో మునిగిపోయాము. మరోసారి, అలాంటి సినిమా తీసే అగత్యం నాకే కాదు, ఎవ్వరికీ రానేకూడదు" అన్నారు స్పీల్‌బెర్గ్.
- " class="align-text-top noRightClick twitterSection" data="">