ETV Bharat / sitara

రెండో తరగతి నుంచే 'కథలు' చెప్పిన రాజమౌళి

దర్శకుడు రాజమౌళి సినిమా అంటేనే ఏదో కొత్తదనం మనముందుకు వస్తుందనే చెప్పాలి. ఎందుకంటే ఆయన ఓ కథను చూపించే ప్రయత్నం ఎంతో భిన్నంగా, ఆసక్తిగా ఉంటుంది. కానీ తనలో చిన్ననాటి నుంచే ఓ కథను ఆసక్తికరంగా చెప్పే కళ ఉందని చెప్పారు రాజమౌళి. ఆ విశేషాలేంటో మీరు చూసేయండి.

rajamouli
రాజమౌళి
author img

By

Published : Aug 1, 2021, 5:15 PM IST

స్టోరీ టెల్లింగ్​(కథ చెప్పడం) ఓ కళ. ఎందుకంటే మనం కథ చెప్పే అంత సేపు ఎదుటివారిని అందులో లీనమైపోయేలా చేయడం, ఊహాలోకంలో విహరింపచేసేలా చేయడం మాములు విషయం కాదు. అయితే ఆ కళ తనలో చిన్నప్పటి నుంచే ఉందని అంటున్నారు స్టార్ దర్శకుడు రాజమౌళి. ఎదుటివారికి తనకు తెలిసిన కథలను ఆసక్తికరంగా చెప్పడం లేదా ఊహించి తనదైన శైలిలో కొత్తగా చెప్పడం వంటివి చేసేవారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా గతంలో ఈటీవీకి ఇచ్చిన ఇంటర్వూలో చెప్పారు. అందుకేనేమో రాజమౌళి సినిమా అనగానే హీరోలు ఏమాత్రం ఆలోచించకుండా గ్రీన్​సిగ్నల్​ ఇచ్చేస్తుంటారు!

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

"మా అమ్మమ్మ దగ్గర చాలా తెలుగు పుస్తకాలు.. పంచతంత్రం, బాలరామాయణం, బాలభారతం ఇలా పిల్లలకు సంబంధించిన ఎన్నో కథల పుస్తకాలు ఉండేవి. నేను చాలా పుస్తకాలు చదివేవాడిని. మా పాఠశాలలో ఎక్స్​ట్రా కరిక్యులర్​ యాక్టివిటీస్​ జరిగేవి. సాధారణంగా ఈ క్లాస్​లో డ్యాన్సింగ్​, సింగింగ్​ ఇంకేదైనా పిల్లల కోసం ఉంటాయి. కానీ నేను రెండు, మూడు, నాలుగు తరగతి చదివేటప్పుడు మా స్కూల్​లో శనివారం ఎక్స్​ట్రా కరిక్యులర్​ యాక్టివిటీస్ అంటే రాజమౌళి స్టోరీ టెల్లింగ్. హ్యాండ్​ రైటింగ్​ క్లాస్​ అయిపోగానే అందరూ నావైపు చూస్తారు. నేను వెళ్లి నిల్చొని నేను చదివిన కథలను చెప్పేవాడిని.​ ఆ కథలో నాకు ఏదైనా నచ్చకపోతే అందులో మార్పులు చేసి నాకు నచ్చిన విధంగా చెప్పేవాడిని"

-రాజమౌళి, దర్శకుడు.

ప్రస్తుతం రాజమౌళి.. ఎన్టీఆర్​, రామ్​చరణ్​లతో 'ఆర్​ఆర్​ఆర్'​ను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్​ 13న విడుదల కానుంది. ఇప్పటికే వచ్చిన టీజర్, పోస్టర్లు అలరిస్తుండగా.. ఆదివారం(ఆగస్టు 1) స్నేహితుల దినోత్సవం సందర్భంగా 'దోస్తీ' పాటను విడుదల చేశారు. ఐదు భాషల్లో ఐదుగురు ప్రముఖ సింగర్స్​ ఈ గీతాన్ని పాడటం విశేషం.

ఇదీ చూడండి: ఆ విషయంలో ఎవరు చెప్పినా వినను: రాజమౌళి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.