ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారిపై వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. మరోవైపు సినీ పరిశ్రమకు చెందిన నటీనటులు తమదైన శైలిలో ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. కాగా, కరోనా నుంచి ప్రజలను కాపాడాలని దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు భగవంతుడిని ప్రార్థించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ట్విటర్‌లో పంచుకున్నారు.
-
I thank all the frontline warriors working hard by endangering their lives - health workers, police, farmers - and pray that we all win this war against #COVID19 together. 🙏🏻 pic.twitter.com/WZhBKa99dB
— Raghavendra Rao K (@Ragavendraraoba) April 30, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">I thank all the frontline warriors working hard by endangering their lives - health workers, police, farmers - and pray that we all win this war against #COVID19 together. 🙏🏻 pic.twitter.com/WZhBKa99dB
— Raghavendra Rao K (@Ragavendraraoba) April 30, 2020I thank all the frontline warriors working hard by endangering their lives - health workers, police, farmers - and pray that we all win this war against #COVID19 together. 🙏🏻 pic.twitter.com/WZhBKa99dB
— Raghavendra Rao K (@Ragavendraraoba) April 30, 2020
"తమ జీవితాలను పణంగా పెట్టి, ముందు వరసలో నిలబడి పోరాటం చేస్తున్న వారందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా హెల్త్ వర్కర్లు, పోలీస్, రైతులకు ఆ భగవంతుడు తగిన శక్తిని ఇవ్వాలని ప్రార్థిస్తున్నా"
- రాఘవేంద్రరావు. దర్శకుడు.
"సకల దేవతలను ఒకటే ప్రార్థిస్తున్నాను. ప్రజలందరినీ ఈ కరోనా మహమ్మారి నుంచి రక్షించమని వేడుకొంటున్నాను. అంతేకాకుండా, రాత్రింబవళ్లు నిత్యం ప్రజల సేవలో నిమగ్నమైన వైద్యులకీ, వైద్య సిబ్బందికి, పోలీస్‌శాఖకు వారి సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకు, రైతన్నలకు ఎందరో దాతలకు, ప్రభుత్వ ఉద్యోగులకు, కరోనాపై పోరాటంలో తగినంత శక్తినీ, ఆరోగ్యాన్ని ప్రసాదించమని ముక్కోటి దేవతలను ప్రార్థిస్తున్నా" అని దేవతా విగ్రహాలను శుభ్రం చేసి అనంతరం పూజ చేసిన వీడియోను పంచుకున్నారు.