దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. కరోనా బారినపడి రోజూ వేల సంఖ్యలో మృతి చెందుతున్నారు. ఈనేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు ఆయా రాష్ట్రాలకు తమ వంతు సాయం అందిస్తున్నారు. తాజాగా కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కూడా తన వంతు ఆర్థిక సాయం అందించారు.
ఈ మేరకు తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలిసిన మురుగదాస్ రూ.25 లక్షలను విరాళంగా అందజేశారు. ఇటీవల నటుడు సూర్య, ఆయన సోదరుడు కార్తి కూడా తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.కోటిని విరాళంగా అందజేశారు.