ETV Bharat / sitara

హరీశ్​ శంకర్​​-వరుణ్​ తేజ్​ కాంబోలో మరో సినిమా? - harish shankar new movie

Harish Shankar Movies: మెగా హీరో వరుణ్​ తేజ్​-హరీశ్​​ శంకర్​ కాంబోలో మరో సినిమా రానున్నట్లు తెలుస్తోంది. వరుణ్​ తేజ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ హరీశ్​ ఓ ట్వీట్​ చేశారు. ఇది చూసిన అభిమానులు వీరిద్దరి కాంబోలో మరో చిత్రం రానుందని ఆశిస్తున్నారు.

harish shankar varun tej
harish shankar varun tej
author img

By

Published : Jan 19, 2022, 4:24 PM IST

Updated : Jan 19, 2022, 5:24 PM IST

మెగాహీరో వరుణ్​తేజ్​-దర్శకుడు హరీశ్​శంకర్​ కాంబో మళ్లీ రిపీట్​ కానుందా? అంటే అవుననే వినిపిస్తోంది. నేడు వరుణ్​ పుట్టినరోజు సందర్భంగా హరీశ్​ చేసిన ట్వీట్​ చూస్తే ఇది అర్థమవుతోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్​లో 'గద్దలకొండ గణేశ్'​ విడుదలై సూపర్​హిట్​గా నిలిచింది. ఇందులో నెగటివ్​ రోల్​ పోషించిన వరుణ్​ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.

ఈ చిత్రాన్ని ఉద్దేశిస్తూ హరీశ్​ మాట్లాడుతూ.. "ఆ పాత్రలో నిన్ను ఊహించుకున్నప్పుడు నాకు తెలియదు.. నువ్వు ఆ పాత్రను ఎంతో కష్టపడి ఆ స్థాయిలో రక్తికట్టిస్తావని. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం నాకు ఎప్పుడూ ఆనందం కలిగించే విషయం. నీతో మరోసారి పనిచేయాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా" అని అన్నారు. దీంతో వరుణ్​-హరీశ్​ కాంబోలో మరో సినిమా వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

కాగా, పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా హరీష్‌ శంకర్‌ ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఆ సినిమాకు 'భవదీయుడు భగత్‌సింగ్‌' అనే టైటిల్‌ ఖరారు చేశారు. షూటింగ్​ ప్రారంభం కావాల్సి ఉంది. దీన్ని ఈ ఏడాది దసరాకు రిలీజ్​ చేయాలని ప్లాన్​ చేస్తున్నట్లు సమాచారం. ఇక వరుణ్​ త్వరలోనే 'గని' చిత్రంలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

ఇదీ చూడండి: మన సినిమాల క్రేజ్.. హిందీలో 'రంగస్థలం'తో పాటు మరిన్ని

Last Updated : Jan 19, 2022, 5:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.