బాలీవుడ్ నటి దియా మీర్జా.. వ్యక్తిగత జీవితంతో పాటు కెరీర్లోనూ జోష్‌ను ముందుకుసాగుతున్నారు. ఇటీవలే విడుదలైన 'వైల్డ్‌డాగ్' చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన ఆమె.. శుక్రవారం ఓ శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు. తాను త్వరలోనే తల్లి కాబోతున్నట్లు సోషల్‌మీడియాలో వెల్లడించారు. మాతృత్వపు మధురిమలు ఆస్వాదించే సమయం కోసం తాను ఎదురుచూస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.
దీంతో దియా మీర్జాకు పలువురు శుభాకాంక్షలు తెలియజేయగా.. మరికొంత మంది నెటిజన్లు మాత్రం భిన్నంగా స్పందించారు. ఫిబ్రవరిలో వివాహబంధంలో అడుగుపెట్టిన దియా మీర్జా.. దాదాపుగా నెల వ్యవధిలోనే గర్భం దాల్చారా? అంటూ నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేశారు. ఈ కామెంట్లపై నటి స్పష్టత ఇచ్చారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
"నేను గర్భం దాల్చినందుకు ఈ పెళ్లి చేసుకోలేదు. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. అలాంటి సమయంలోనే మా జీవితంలోకి చిన్నారి రాబోతుందనే విషయం తెలిసింది. గర్భవతిని అయ్యానని హడావుడిగా పెళ్లి చేసుకోలేదు. ఇదే విషయాన్ని పెళ్లికి ముందు ప్రకటించడానికి మాకెటువంటి అభ్యంతరం లేదు. కానీ, నాకు అప్పటికే కొన్ని ఆరోగ్య సమస్యలున్నాయి. అందుకే ఈ విషయాన్ని ముందుగా బహిర్గతం చేయలేకపోయాను. మీరంతా అనుకున్నట్లుగా తల్లికాబోతున్న విషయాన్ని ఆలస్యంగా ప్రకటించడంలో మరే ఉద్దేశం లేదు".
- దియా మీర్జా, కథానాయిక
తొలుత బాలీవుడ్ నిర్మాత సాహిల్ సంఘాను వివాహమాడిన దియా మీర్జా.. ఐదేళ్ల తర్వాత అతడి నుంచి విడిపోయారు. అనంతరం సాహిల్ నుంచి విడాకులు తీసుకొని ఫిబ్రవరిలో వైభవ్ రేఖీ అనే వ్యాపారవేత్తను ప్రేమించి పెళ్లాడారు.
ఇదీ చూడండి: టాలీవుడ్ బ్రదర్స్: చిరు-పవన్ టూ విజయ్-ఆనంద్!