బాలీవుడ్ క్లాసిక్ హిట్ 'దిల్వాలే దుల్హానియా లే జాయేంగే' సినిమా థియేటర్లో మరోసారి ప్రదర్శించనున్నారు. మహారాష్ట్రలో గురువారం(నవంబరు 5) నుంచి సినిమా హాళ్లు తిరిగి తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రేక్షకుల్ని 'డీడీఎల్జే' అలరించనుంది.
ప్రఖ్యాత మరాఠా మందిర్‌లో శుక్రవారం నుంచి ప్రతిరోజూ షోలు వేయనున్నారు. ఇదే థియేటర్లో గతంలో డీడీఎల్జే విడుదలైనప్పటి నుంచి నిరంతరాయంగా ఆడుతూనే ఉంది. లాక్డౌన్ కారణంగా అది నిలిచిపోయి, మళ్లీ ఇప్పుడు తిరిగి మొదలైంది.
హిమాలయాలకు నాగార్జున గుడ్‌బై
'వైల్డ్‌డాగ్' చిత్రీకరణలో భాగంగా హిమాలయాల్లో ఉన్న హీరో నాగార్జున.. తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తిచేశారు. ఈ మేరకు కొన్ని ఫొటోల్ని విడుదల చేశారు. ఇందులో ఎన్ఐఏ అధికారి విజయ్ వర్మగా నాగ్ కనిపించనున్నారు. అహిషోర్ సోలమన్ దర్శకుడు.
ట్రైలర్‌తో 'రేడియో మాధవ్'
మలయాళ నటుడు జయరామ్, తమిళ స్టార్ విజయ్ సేతుపతి, పూర్ణ కలిసి నటించిన 'మార్కోని మతాయ్' సినిమా.. తెలుగులో 'రేడియో మాధవ్'గా రానుంది. ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేశారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: