సాధారణంగా తెరపై కనువిందు చేసే నటులకు తమ సినీప్రయాణంలో వారికి నచ్చిన ఓ అద్భుతమైన పాత్రను పోషించాలని కల ఉంటుంది. ఎవరైనా వేరే హీరో ఆ పాత్ర చేస్తే అయ్యో అలాంటి పాత్ర నేను చేయలేకపోయానే అని భావిస్తుంటారు. అలాంటి ఓ అనుభవమే జేమ్స్‌బాండ్ ఫేం డేనియల్ క్రేగ్‌కు ఎదురైందట. తనకు చిన్ననాటి నుంచే సూపర్‌హీరో పాత్రలు చేయాలనే ఆకాంక్ష ఉందని ఓ ఇంటర్వ్యూలో మనసులోని మాటను బయటపెట్టాడు. ఇంతకీ అది ఏ పాత్ర అనేదేగా మీ సందేహం. అది మరేదో కాదు.. ప్రతిఒక్కరు మెచ్చే యాక్షన్ హీరో స్తైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, ది ఇన్విజిబుల్ మ్యాన్ పాత్రలట.
తాజాగా క్రేగ్ నటించిన 'నో టైమ్ టు డై' సినిమా ప్రచారంలో భాగంగా ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఆ సమాధానం చెప్పాడు. మీకు చిన్నప్పటి నుంచే జేమ్స్ బాండ్ పాత్ర చేయాలని కలగన్నారా? అంటూ ప్రశ్నించాడు. దానికి సమాధానమిస్తూ "లేదు చేయాలని నేనెప్పుడు అనుకోలేదు. నేను నా చిన్నప్పటి నుంచి సూపర్ మ్యాన్ , స్పైడర్ మ్యాన్, ది ఇన్విజిబుల్ మ్యాన్, పాత్రలు చేయాలని కలలు కనేవాడిని" అని సమాధానం ఇచ్చాడు. కానీ తన కల అలానే మిగిలిపోయిందని విచారం వ్యక్తం చేశాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ప్రస్తుతం ప్రపంచంలో కరోనా ప్రభావం ఎక్కువుగా ఉండటం వల్ల 'నో టైమ్ టు డై' చిత్ర విడుదల తేదీ వాయిదా పడింది. ఇది జేమ్స్‌బాండ్ సిరీస్‌లో 25వ చిత్రం. ఇప్పటివరకు నాలుగు చిత్రాల్లో జేమ్స్‌బాండ్‌గా నటించాడు డేనియల్ క్రేగ్. ఇది అతడికి అయిదో సినిమా. 2006లో వచ్చిన క్యాసినో రాయల్ చిత్రంతో తొలిసారి బాండ్ అవతారమెత్తాడు క్రేగ్.
ఇదీ చూడండి : బ్రేకప్ రూమర్స్‌కు చెక్ పెట్టిన ఆలియా