ETV Bharat / sitara

నా పిల్లలకు చిల్లిగవ్వ ఇవ్వను.. స్టార్ హీరో సంచలనం - ఆస్తుల పంపకంపై డేనియల్

ఓ స్టార్ హీరో చేసిన ప్రకటన సంచలనంగా మారింది. తను సంపాదించిన ఆస్తిలో చిల్లిగవ్వ కూడా తన పిల్లలకు ఇవ్వనని ఆయన స్పష్టం చేయడమే కారణం.

Daniel Craig
డేనియల్ క్రెయిగ్
author img

By

Published : Aug 18, 2021, 3:58 PM IST

ప్రముఖ హాలీవుడ్ చిత్రం 'జేమ్స్​బాండ్' ఫేమ్ డేనియల్ క్రెయిగ్.. సంచలన ప్రకటన చేశాడు. సినిమాల ద్వారా తను సంపాదించిన వేలకోట్ల ఆస్తిలో చిల్లిగవ్వ కూడా తన పిల్లలకు ఇవ్వనని ఇటీవలే ఓ మేగజైన్ కోసం ఇచ్చిన ఇంటర్యూలో తెలిపాడు.

మాజీ భార్య ఫియొన లౌడొన్​ కూతురు ఎల్లా, ప్రస్తుత భార్య రాచెల్​ వెయిజ్ కూతురు.. డేనియల్​ సంతానం. కాగా.. వెయిజ్​ తనయుడు హెన్రీకి కూడా డేనియల్ క్రెయిగ్ పినతండ్రి.

"తర్వాత తరానికి ఆస్తి పంచాలని నేను ఆశించడం లేదు. నా దృష్టిలో వారసత్వం చాలా అసహ్యకరమైంది. 'వారసత్వానికి చాలా దూరంగా ఉండాలి లేదా మరణానికి ముందే వారికి ఆస్తులు పంచేయాలి' అనే సూత్రాన్ని నేను నమ్ముతా."

--డేనియల్ క్రెయిగ్, నటుడు.

జేమ్స్​ బాండ్ ఐదు సినిమాల్లో నటించిన డేనియల్.. దాదాపు రూ. 1200 కోట్ల ఆస్తిని సంపాదించాడు.

ఇదీ చదవండి:

మరింత ఆలస్యంగా బాండ్ సినిమా.. మళ్లీ వాయిదా

హిందీ సినిమా ఆడిషన్​లో 'జేమ్స్​బాండ్'​ హీరో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.