ETV Bharat / sitara

మరింత ఆలస్యంగా బాండ్ సినిమా.. మళ్లీ వాయిదా - జేమ్స్ బాండ్ న్యూస్

డేనియల్ క్రెయిగ్ చివరి బాండ్ చిత్రం 'నో టైమ్ టూ డై' విడుదల తేదీ మరోసారి మారింది. అక్టోబరు 8న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

Daniel Craig starrer 'No Time To Die' release delayed again
జేమ్స్ బాండ్ నో టైమ్ టూ డై
author img

By

Published : Jan 22, 2021, 3:45 PM IST

జేమ్స్ బాండ్ సిరీస్​లో 25వ సినిమా 'నో టైమ్ టూ డై'.. రాక మరింత ఆలస్యం కానుంది. ఏప్రిల్​ 2న విడుదల అవ్వాల్సింది కాస్త అక్టోబరు 8న థియేటర్లలోకి రానుంది. ఎప్పుడో రావాల్సిన ఈ చిత్రం.. కరోనా కారణంగా వాయిదాలు పడుతూ వస్తోంది.

తొలుత గతేడాది మార్చిలో 'నో టైమ్ టూ డై'ను రిలీజ్​ చేయాలనుకున్నారు. కరోనా వైరస్​ ప్రభావంతో ఈ సంవత్సరం ఫిబ్రవరి 26న తీసుకురావాలనుకున్నారు. కొన్ని కారణాల వల్ల ఏప్రిల్​ 2కు వాయిదా పడింది. ఇప్పుడు అక్టోబరు 8కి విడుదల తేదీ మారింది. గత 10 నెలల్లో సినిమా మూడుసార్లు వాయిదా పడింది. దీంతో ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి సన్నిగిల్లే అవకాశముంది!

డేనియల్ క్రెయిగ్ చివరగా నటించిన బాండ్ చిత్రమిది. ఆస్కార్ విజేత రమీ మాలిక్ విలన్​గా కనిపించనున్నారు. క్యారీ ఫుకొనాగా దర్శకత్వం వహించారు.​

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇది చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.