'జేమ్స్ బాండ్'(James bond) సినిమాలతో అలరించిన డేనియల్ క్రెయిగ్(daniel craig) అరుదైన ఘనత సాధించారు. ప్రపంచంలో ఎక్కువ మొత్తం అందుకుంటున్న నటుడిగా(highest remuneration hero in world) నిలిచారు.
ఈ జాబితాలో క్రెయిగ్ తర్వాత డ్వేన్ జాన్సన్(dwayne johnson)- రెడ్ వన్(30 మిలియన్ డాలర్స్), విల్ స్మిత్(will smith)(కింగ్ రిచర్డ్)- డెంజల్ వాషింగ్టన్(ద లిటిల్ థింగ్స్)-40 మిలియన్ డాలర్స్, లియోనార్డో డికాప్రియో(leonardo dicaprio)-డోంట్ లుక్ అప్(30 మిలియన్ డాలర్స్) ఉన్నారు.
'నైవ్స్ ఔట్' రెండు సీక్వెల్స్ కోసం నెట్‌ఫ్లిక్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్న డేనియల్.. 100 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.732 కోట్ల మొత్తాన్ని ఆర్జించనున్నారు.
అలానే సినిమాల ద్వారా సంపాదించిన ఆస్తిలో తన పిల్లలకు చిల్లిగవ్వ కూడా ఇవ్వనని ఇటీవల ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డేనియల్ వెల్లడించారు.
'జేమ్స్ బాండ్' సిరీస్‌లో ఐదు సినిమాల్లో నటించిన డేనియల్.. దాదాపు రూ.1200 కోట్లు అందుకున్నాడు. ప్రస్తుతం ఇతడి ఆస్తి రూ.1194 కోట్లకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది చదవండి: నా పిల్లలకు చిల్లిగవ్వ ఇవ్వను.. స్టార్ హీరో సంచలనం