జాతీయ అవార్డు గ్రహీత నటుడు వీర సతీదార్ తుదిశ్వాస విడిచారు. కరోనా సంబంధిత కారణాలతో ఆస్పత్రిలో చేరిన ఆయన కన్నుమూశారు. 'కోర్టు' సినిమాతో నేషనల్ అవార్డు దక్కించుకుని ఈయన దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.
వీర సతీదార్కు ఇటీవలే కరోనా సోకింది. చికిత్స కోసం ఆస్పత్రిలో చేరగా.. సోమవారం రాత్రి ఆరోగ్యం విషమించడం వల్ల ఆయన్ను వెంటిలేటర్‌పై ఉంచారు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు సతీదర్.. మరణించినట్లు 'కోర్టు' సినిమా దర్శకుడు తమ్హనే వెల్లడించారు. సతీదర్ మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసినట్లు తెలిపారు.
ఇదీ చూడండి: బోయపాటి సినిమాలో 'అఖండ'గా బాలయ్య