అందం, అభినయంతో అభిమానుల మనసుల్లో చోటు సంపాదించుకున్న కాజల్.. ప్రేక్షకుల్ని భయపెట్టేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఆమె నటించిన వెబ్ సిరీస్ 'లైవ్ టెలికాస్ట్' శుక్రవారం (ఫిబ్రవరి 12) డిస్నీ ప్లస్ హాట్స్టార్ వేదికగా విడుదలవనుంది. ప్రమోషన్లలో భాగంగా ఈ సిరీస్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది కాజల్.
"ఈ సిరీస్ను పూర్తిగా ఓ ఇంట్లో తెరకెక్కించారు. దర్శకుడు వెంకట్ ప్రభు స్నేహితుడి ఇల్లు అది. ఓ కొండపై ఉంటుంది. ఆ చుట్టు పక్కల ఎవరూ ఉండరు. హారర్ చిత్రాలను తెరకెక్కించడానికి అనువైన చోటది. ఈ సిరీస్ జరిగే సమయంలో ఒక్కరోజు కూడా పడుకోలేదు. షూటింగ్ ప్యాకప్ అయ్యాక నిద్రపోయే సమయంలో భయమయ్యేది. అందుకే నిద్ర పోకుండా ఉండేదాన్ని. ఇదొక మంచి అనుభవం."
-కాజల్, నటి
ఇంటెన్స్ థ్రిల్లర్గా రూపొందనున్న ఈ సిరీస్కు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించాడు. కయాల్ ఆనంది, వైభవ్, ప్రియాంక, సెల్వ కీలక పాత్ర పోషించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">