ETV Bharat / sitara

ఓటీటీలో విడుదలకు సిద్ధమైన 'గులాబో సితాబో'

author img

By

Published : May 14, 2020, 3:47 PM IST

కరోనా లాక్​డౌన్​ కారణంగా దేశవ్యాప్తంగా సినిమా విడుదలలు, షూటింగ్​లు వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో కొంతమంది నిర్మాతలు తమ చిత్రాన్ని డిజిటల్​ ప్లాట్​ఫాంపై విడుదల చేయడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో అమితాబ్​ నటించిన 'గులాబో సితాబో' చేరింది.

Confirmed! Big B, Ayushmann's Gulabo Sitabo to release on OTT
ఓటీటీలో విడుదలకు సిద్ధమైన 'గులాబో సితాబో'

బాలీవుడ్​ మెగాస్టార్​ అమితాబ్​ బచ్చన్​ ప్రధానపాత్రలో, ఆయుష్మాన్​ ఖురానా హీరోగా తెరకెక్కిన చిత్రం 'గులాబో సితాబో'. కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. అయితే ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీ ఫ్లాట్​ఫాంలో జూన్​ 12వ తేదిన విడుదల చేయనున్నామని చిత్రబృందం ప్రకటించింది.

ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఇద్దరు హీరోలు ట్వీట్​ చేశారు. ఆయుష్మాన్​తో కలిసి పనిచేయడం చాలా బాగుందని అమితాబ్​ ప్రస్తావించగా.. తనకు ఇది ప్రత్యేక సినిమా అని యువకథానాయకుడు పేర్కొన్నాడు.

గతంలో విడుదలైన 'పీకూ', 'విక్కీ డోనర్'​, 'మద్రాస్​ కేఫ్'​, 'పింక్​' వంటి వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కించిన సుజీత్​ సర్కార్​ 'గులాబో సితాబో'కు దర్శకత్వం వహించారు. రైజింగ్​ సన్​ ఫిలింస్​ ప్రొడక్షన్​లో ఈ చిత్రం నిర్మితమైంది.

భవిష్యత్​ అంతా ఓటీటీదే

ఈ సినిమాను ఏప్రిల్​లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాణ సంస్థ భావించగా.. లాక్​డౌన్​ కారణంగా విడుదల వాయిదా పడింది. దీంతో ఈ సినిమాను డిజిటల్​ ప్లాట్​ఫాం ద్వారా విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించింది. భవిష్యత్​ అంతా డిజిటల్​ తరం కాబోతుందని దర్శకుడు సుజీత్​ సర్కార్​ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి.. సల్మాన్​ హృదయాన్ని దోచిన సుందరి జరీన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.