ETV Bharat / sitara

RAPO19: రామ్​తో సినిమా.. అంతలోనే దర్శకుడిపై ఫిర్యాదు - RAM KRITHI SHETTY

స్టార్ డైరెక్టర్ లింగుస్వామిపై దక్షిణాది చిత్రమండలిలో ఫిర్యాదు చేశారు ప్రముఖ నిర్మాత జ్ఞాన్​వేల్ రాజా. అడ్వాన్స్​ తీసుకుని తమ సంస్థలో సినిమా చేయలేదని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Complaint against Ram Pothineni's director Linguswamy
రామ్
author img

By

Published : Jun 26, 2021, 3:45 PM IST

Updated : Jun 26, 2021, 4:15 PM IST

హీరో రామ్(#RAPO19) కొత్త సినిమా చిక్కుల్లో పడే అవకాశం కనిపిస్తోంది. ఈ చిత్ర దర్శకుడు లింగుస్వామిపై తమిళ ప్రముఖ నిర్మాత జ్ఞాన్​వేల్ రాజా ఫిర్యాదు చేయడమే ఇందుకు కారణం.

అసలేం జరిగింది?

పందెం కోడి, ఆవారా లాంటి డబ్బింగ్ సినిమాలతో పేరు తెచ్చుకున్న లింగుస్వామి.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అయితే ఆయన స్టూడియోగ్రీన్ నిర్మాణ సంస్థలో చిత్రం తీసేందుకు అడ్వాన్స్ తీసుకున్నారు. అయితే ఇప్పటివరకు తమ సంస్థలో అందుకు సంబంధించిన సినిమా చేయాలేదని, ఇప్పుడు రామ్​తో మూవీ తీసేందుకు సిద్ధమయ్యారని నిర్మాత జ్ఞాన్​వేల్ రాజా, దక్షిణాది చిత్ర మండలిలో ఫిర్యాదు చేశారు. తమతో సినిమా చేసిన తర్వాతే రామ్​తో చిత్రం తీస్తారని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు.

director Linguswamy
దర్శకుడు లింగుస్వామి

రామ్-లింగుస్వామి సినిమా కొన్నిరోజుల క్రితమే ప్రకటించారు. దీని గురించి ఇటీవల మరోసారి ట్వీట్ చేసిన రామ్.. ఫైనల్​ నరేషన్​ పూర్తయిందని, షూటింగ్ కోసం ఎదురుచూస్తున్నానని చెప్పారు. ఇందులో కృతిశెట్టి హీరోయిన్​గా నటిస్తోంది. శ్రీనివాస సిల్వర్​ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Jun 26, 2021, 4:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.