Clap trailer news: 'పరిగెత్తు.. ఇంకా వేగంగా పట్టుదలతో పరిగెత్తు. తప్పకుండా గెలుస్తావు. ఒక్క విషయం గుర్తు పెట్టుకో నువ్వు పోటీ చేసేది మనుషులతో కాదు.. టైమ్‌తో' అంటున్నారు యువ కథానాయకుడు ఆది. ఆయన కీలక పాత్రలో పృథ్వీ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'క్లాప్'. ఆకాంక్ష సింగ్ కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నేరుగా ఓటీటీ వేదికగా విడుదలయ్యేందుకు సిద్ధమైంది.
ప్రముఖ ఓటీటీ సోనీలివ్ వేదికగా మార్చి 11వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు ట్రైలర్ విడుదల చేసింది. అథ్లెట్ అయిన ఆది కాలు ఎలా పోగొట్టుకున్నాడు? ఆ తర్వాత అతడి జీవితం ఎలా మారింది. భాగ్యలక్ష్మి అనే యువతిని అథ్లెట్‌ను చేయడానికి అతడు పడిన కష్టం ఏంటి? చివరకు ఆమెను అద్భుతమైన అథ్లెట్‌గా తీర్చిదిద్దాడా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే! ఈ సినిమాకు ఇళయరాజా స్వరాలు సమకూరుస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
డీజే టిల్లు రికార్డు..
DJ Tillu ott record: సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై తెరకెక్కిన చిత్రం 'డిజె టిల్లు'. నేహాశెట్టి నాయిక. విమల్‌కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి ఆటనుంచే సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ ముందు విజయం సాధించింది. అయితే ఈ చిత్రం మార్చి 4న ఓటీటీలో విడుదలైంది.
అయితే ఓటీటీలో రికార్డు సృష్టించింది డీజే టిల్లు. ఆహాలో విడుదలైన కేవలం 48 గంటల్లోనే 10 కోట్ల వ్యూస్ దక్కించుకుంది ఈ చిత్రం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
రాధేశ్యామ్ సాంగ్ టీజర్
Radheshyam song teaser: ప్రభాస్ 'రాధేశ్యామ్' నుంచి 'మెయిన్ ఇష్క్ మెయిన్ హూ' అంటూ సాగే హిందీ సాంగ్ టీజర్‌ను మార్చి 6న మధ్యాహ్నాం ఒంటిగంటకు విడుదల చేయనుంది చిత్రబృందం. ఇక మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
రొమాంటిక్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాకు దర్శకధీరుడు రాజమౌళి వాయిస్ ఓవర్ ఇచ్చారు. కృష్ణంరాజు కీలకపాత్ర పోషించారు. జస్టిన్ ప్రభాకరన్ పాటలు స్వరపరచగా, తమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్- గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: 'రాధేశ్యామ్' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?