*సునీల్ హీరోగా మళ్లీ నటించేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ప్రకటించిన 'వేదాంతం రాఘవయ్య'.. శనివారం లాంఛనంగా ప్రారంభమైంది. హరీశ్ శంకర్ కథ అందించగా, చంద్రమోహన్ దర్శకుడు.


*కార్తికేయ, లావణ్య త్రిపాఠి నటిస్తున్న 'చావు కబురు చల్లగా' టీజర్ గ్లింప్స్ ఈనెల 11న ఉదయం 10:56 గంటలకు రానుంది. జీఏ2 పిక్చర్స్ నిర్మిస్తుండగా, కౌశిక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బస్తీ బాలరాజుగా కథానాయకుడు కనిపించనున్నారు.

*నాగచైతన్య 'థాంక్యూ' సెట్లో నిర్మాత శిరీష్ పుట్టినరోజు వేడుకలు జరిపారు. ఈ మేరకు కొన్ని ఫొటోల్ని చిత్రబృందం పంచుకుంది.

*నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి నటిస్తున్న హాస్యభరిత సినిమా 'జాతిరత్నాలు'. దీని తొలి లిరికల్ ఈనెల 11న విడుదల కానుంది. ఈ విషయాన్ని చెబితూ చిత్రంలో నటిస్తున్న ఫరియాను పరిచయం చేశారు. ఆమె చిట్టి పాత్రలో కనిపించనుంది.

*కన్నడ హీరో ఉపేంద్ర నటిస్తున్న 'కబ్జా' నుంచి క్రేజీ అప్డేట్ సంక్రాంతి(జనవరి 14) ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా కథతో తీస్తున్నారు.

*బెల్లంకొండ శ్రీనివాస్ 'అల్లుడు అదుర్స్' ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఆదివారం సాయంత్రం జరగనుంది. ఈనెల 15న సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

ఇవీ చదవండి: