ETV Bharat / sitara

రామ్​కు విలన్​గా ఆది.. రవితేజకు ఇద్దరు హీరోయిన్స్​ - Vidyut jamwal sankalpreddy

సినీ అప్డేట్స్​ వచ్చేశాయి. రవితేజ, రామ్​పోతినేని, సూర్య, విద్యుత్​ జమ్వాల్​, ఆయుష్మాన్​ ఖురానా చిత్రాలకు సంబంధించిన కొత్త సంగతులు ఇందులో ఉన్నాయి.

cinema updates
సినిమా అప్డేట్స్​
author img

By

Published : Jul 19, 2021, 1:41 PM IST

యువహీరో రామ్‌ పోతినేని(Ram pothineni) తమిళ​ దర్శకుడు లింగుస్వామితో(Linguswamy) ఓ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కూడా జరుగుతోంది. అయితే ఇందులో విలన్​గా ఆది పినిశెట్టిని ఎంపిక చేసినట్లు వెల్లడించారు. కృతి శెట్టి(Krithi Shetty) హీరోయిన్. ఇందులో రామ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం.

cinema updates
రామ్​కు విలన్​గా ఆది పినిశెట్టి

రవితేజ (Ravi Teja) డైరెక్టర్ శరత్‌ మండవ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం 'రామారావు ఆన్ డ్యూటీ'. ఇందులో హీరోయిన్లుగా దివ్యాంశ కౌశిక్‌(Divyansha Kaushik), రజిష విజయన్​(Rajisha Vijayan) నటిస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. ఇటీవలే హైదరాబాద్‌లో చిత్రీకరణ ప్రారంభమైంది.

cinema updates
దివ్యాంశ కౌశిక్‌
cinema updates
రజిష విజయన్

తమిళ స్టార్​ హీరో సూర్య 40వ సినిమా ఫస్ట్​లుక్ జులై 22న​ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. తమిళనాడు పొల్లాచిలో రెండేళ్ల క్రితం జరిగిన గ్యాంగ్​రేప్​ కథాంశంతోనే ఈ సినిమా రూపొందించబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. పాండిరాజ్​ దర్శకత్వం వహిస్తున్నారు.

నటి నేహా ధూపియా మరోసారి తల్లికాబోతుంది. ఈ విషయాన్ని సోషల్​మీడియా ద్వారా వెల్లడించిన ఆమె.. ఓ ఫొటోను పోస్ట్ చేసింది. మోడల్, నటుడు అంగద్‌ బేడీని ఈమె పెళ్లి చేసుకుంది. 2018లో వీరికి ఒక పాప జన్మించింది.

cinema updates
మరోసారి తల్లి కాబోతున్న నేహా ధూపియా

ఆయుష్మాన్​ ఖురానా, రకుల్​ప్రీత్​ సింగ్​ జంటగా నటిస్తున్న చిత్రం 'డాక్టర్ జీ'. ఫస్ట్​లుక్​ను సోమవారం విడుదల చేశారు. అనుభూతి కశ్యప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. జంగ్లీ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది.

cinema updates
డాక్టర్​ జీ ఫస్ట్​లుక్​

బాలీవుడ్​ నటుడు విద్యుత్​ జమ్వాల్​ ఇటీవల 'యాక్షన్​ హీరో ఫిల్మ్​' ప్రొడక్షన్​ కంపెనీని స్థాపించారు. నిర్మాతగా తన తొలి సినిమాకు జాతీయ అవార్డు గ్రహీత సంకల్ప్​రెడ్డిని దర్శకుడిగా ఎంచుకున్నారు. సోమవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

cinema updates
విద్యుత్​ జమ్వాల్​
cinema updates
సంకల్ప్​రెడ్డి దర్శకుడిగా

ఇదీ చూడండి: RC 15: రామ్​చరణ్​ కొత్త సినిమాకు సంగీత దర్శకుడు ఫిక్స్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.