ETV Bharat / sitara

చిరు అభిమానులకు శుభవార్త.. ఫస్ట్​లుక్ వచ్చేస్తోంది!

మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్​లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి సర్​ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధమైంది చిత్రబృందం. చిరు పుట్టినరోజైన ఆగస్టు 22న ఫస్ట్​లుక్, మోషన్ పోస్టర్​ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

author img

By

Published : Aug 18, 2020, 4:42 PM IST

చిరు అభిమానులకు శుభవార్త.. ఫస్ట్​లుక్ వస్తోంది!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే దాదాపు చిత్రీకరణ పూర్తికాగా కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడింది. ఈ సినిమా టైటిల్, ఫస్ట్​లుక్​ కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులను స్వస్తి చెబుతూ ఈ చిత్రం నుంచి ఎట్టకేలకు సర్​ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధమైంది చిత్రబృందం.

చిరు పుట్టినరోజైన ఆగస్టు 22న ఈ సినిమా ఫస్ట్​లుక్, మోషన్​ పోస్టర్​ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. సాయంత్రం 4 గంటలకు ఈ సర్​ప్రైజ్ విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రీలుక్​ను తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో చేతిలో ఎర్ర కండువాతో కనిపిస్తున్నాడు చిరు.

ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్​గా చేస్తుండగా.. దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు. మెగా పవర్ స్టార్ రామ్​ చరణ్ ఓ ప్రత్యేక పాత్రలో కనిపిస్తాడని సమాచారం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.