మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాపై కొన్ని రోజులుగా వస్తోన్న పుకార్లను ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరైన నిరంజన్ రెడ్డి ఖండించారు. అలాగే ఆయన అన్ని సందేహాలకు చెక్ పెడుతూ ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు.
ఏం జరిగింది?
ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కొద్దిరోజులుగా కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్, నిర్మాత రామ్ చరణ్ ఈ సినిమా నిర్మాణంలో క్రియాశీలకంగా వ్యవహరించట్లేదన్న వార్తలు వస్తున్నాయి. పెట్టుబడి మొత్తం మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ అధినేత నిరంజన్ రెడ్డి భరిస్తున్నారు అంటూ సినీ వర్గాల్లో వినిపించింది. ఈ వార్తలకు సమాధానంగా కొణిదెల ప్రొడక్షన్స్ మరియు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ అన్ని విధాలుగా సమానమైన నిర్మాణ భాగస్వాములు అని నిర్మాత నిరంజన్ రెడ్డి చెప్పుకొచ్చారు.