ETV Bharat / sitara

బోయపాటితో చిరు.. అభిమానుల్లో భారీ అంచనాలు! - అఖండ సినిమా

'అఖండ' సినిమాతో ఘన విజయాన్ని అందుకున్న దర్శకుడు బోయపాటితో సినిమా చేసేందుకు మెగాస్టార్​ చిరంజీవి సిద్ధమయ్యారట! త్వరలోనే ఓ మంచి స్క్పిప్ట్​తో తనవద్దకు రావాలని, కథ నచ్చితే మూవీ చేస్తానని బోయపాటితో చెప్పారని తెలిసింది.

చిరంజీవి బోయపాటి సినిమా, chiranjeevi boyapati srinu film,
చిరంజీవి బోయపాటి సినిమా
author img

By

Published : Dec 6, 2021, 9:36 AM IST

Updated : Dec 6, 2021, 11:50 AM IST

నందమూరి హీరో బాలకృష్ణ-దర్శకుడు బోయపాటి కాంబోలో సినిమా అంటే ఏ రేంజ్​లో ఉంటుందనేది 'అఖండ' సినిమాతో మరోసారి రుజువైంది. ఈ చిత్రం ఇటీవలే విడుదలై బాక్సాఫీస్​ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలోనే.. బోయపాటి-మెగాస్టార్​ చిరంజీవి కాంబోలో మూవీ వస్తే?.. ఎలా ఉంటుందో అని మాట్లాడుకోవడం ప్రారంభించేశారు అభిమానులు. ఎందుకంటే 'అఖండ' సినిమా విజయంతో తానేంటో మరోసారి నిరూపించుకున్నారు బోయపాటి. దీంతో ఆయనతో సినిమా చేయాలని చిరంజీవి నిర్ణయించుకున్నారట! ఇప్పటికే వీరిద్దరి మధ్య చర్చలు కూడా జరిగాయని తెలుస్తోంది. ఓ మంచి స్క్పిప్ట్​తో రావాలని బోయపాటిని చిరు అడిగారట.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ప్రస్తుతం 'అఖండ' విజయంతో ఆనందంలో ఉన్న బోయపాటి.. త్వరలోనే ఓ మంచి కథను తయారుచేసి చిరును సంప్రదించేందుకు సిద్ధమవుతున్నారట! ఈ స్క్రిప్ట్​ చిరుకు నచ్చితే అధికారికంగా ప్రకటించి సెట్స్​పైకి సినిమాను తీసుకెళ్తారు.

కాగా, బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'అఖండ' సినిమా విడుదలై రికార్డులు సృష్టిస్తోంది. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా బాలకృష్ణ నటన, గెటప్​, బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్​ సినిమాకు హైలెట్​గా నిలిచాయి. ఇక చిరు విషయానికొస్తే.. ఫిబ్రవరి 4న దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన 'ఆచార్య' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇందులో రామ్​చరణ్​ కీలక పాత్ర పోషించగా.. కాజల్​ అగర్వాల్​, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీతో పాటు 'భోళాశంకర్'​, 'గాడ్​ఫాదర్'​, బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు.

Tags: Tollywood news, Chiranjeevi new movie, Boyapati new movie, Akhanda,

ఇదీ చూడండి: Akhanda Movie: 'అఖండ' జోరు.. బాక్సాఫీసుకు ఊపు

Last Updated : Dec 6, 2021, 11:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.